Raju wed Rambhai: 'రాజు వెడ్స్ రాంబాయి’ ఫస్ట్ డే అదిరిపోయే వసూళ్లు..
ABN , Publish Date - Nov 22 , 2025 | 05:28 PM
అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం ఈ వారం విడుదలైన చిత్రాల్లో మంచి టాక్ తెచ్చుకోవడమే కాక కలెక్షన్లలోనూ జోరు చూపిస్తోంది.
అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం ఈ వారం విడుదలైన చిత్రాల్లో మంచి టాక్ తెచ్చుకోవడమే కాక కలెక్షన్లలోనూ జోరు చూపిస్తోంది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసలు అందజేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. తొలి రోజు ఏపీ, తెలంగాణలో రూ. 1.47 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది, ఈ విషయాన్ని మేకర్స్ తెలియజేశారు. మొదటి రోజు జోరు చూస్తుంటే ‘రాజు వెడ్స్ రాంబాయి’ మరింత మంచి వసూళ్లు రాబట్టేలా ఉందని చెబుతున్నారు.
డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి దీనిని నిర్మించారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. వంశీ నందిపాటి, బన్నీ వాస్ ఈ సినిమాను విడుదల చేశారు.