Bollywood: ‘మాలిక్‌’ నుంచి ప్రత్యేక గీతం

ABN , Publish Date - Jun 21 , 2025 | 06:49 AM

రాజ్‌కుమార్‌ రావు, మానుషి చిల్లర్‌ జంటగా పుల్కిత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బాలీవుడ్‌ చిత్రం ‘మాలిక్‌’. టిప్స్‌ ఫిల్మ్స్‌, నార్తర్న్‌ లైట్స్‌ ఫిల్మ్స్‌ సంస్థలు నిర్మించాయి.

రాజ్‌కుమార్‌ రావు, మానుషి చిల్లర్‌ జంటగా పుల్కిత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బాలీవుడ్‌ చిత్రం ‘మాలిక్‌’. టిప్స్‌ ఫిల్మ్స్‌, నార్తర్న్‌ లైట్స్‌ ఫిల్మ్స్‌ సంస్థలు నిర్మించాయి. ఈ సినిమా జూలై 11న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్‌ శుక్రవారం హ్యుమా ఖురేషీపై చిత్రీకరించిన ‘దిల్‌ థామ్‌ కే...’ అంటూ సాగే ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు. అమితాబ్‌ భట్టాచార్య పాటను రాయగా, సచిన్‌- జిగర్‌ స్వరాలు సమకూర్చారు.


రష్మిత్‌ కౌర్‌, రానా ముజుందార్‌ ఆలపించారు. కాగా, నెట్టింట విడుదలైన కొద్ది గంటల్లోనే ప్రేక్షకుల నుంచి ఈ పాటకు విశేష స్పందన లభించింది. చాలా మంది నెటిజన్లు హ్యుమా ఖురేషీ నృత్యాన్ని ‘స్త్రీ-2’లో తమన్నా భాటియా ప్రత్యేక గీతం ‘ఆజ్‌ కీ రాత్‌ మజా...’తో పోల్చుతూ ప్రశంసించారు. కాగా, రాజ్‌కుమార్‌ రావు ఇందులో గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపించనున్నారు.

Updated Date - Jun 21 , 2025 | 10:07 AM