Coolie: ఆంధ్రాలో రేట్ల పెంపు.. కొత్త కథకు రజనీసై..

ABN , Publish Date - Aug 12 , 2025 | 09:45 PM

తలైవా రజనీకాంత్‌ (Rajanikanth) ఆగస్ట్‌ 14న ‘కూలీ’ (Coolie) సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రానున్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో ఆన్‌లైన్‌ బుకింగ్‌ ఓపెన్‌ కాగా, తెలుగు రాష్ట్రాల్లో తాజాగా విడుదల చేశారు.

తలైవా రజనీకాంత్‌ (Rajanikanth) ఆగస్ట్‌ 14న ‘కూలీ’ (Coolie) సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రానున్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో ఆన్‌లైన్‌ బుకింగ్‌ ఓపెన్‌ కాగా, తెలుగు రాష్ట్రాల్లో తాజాగా విడుదల చేశారు. మంగళవారం సాయంత్రం నుంచి టికెట్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ‘కూలీ’ సినిమా విడుదల రోజు అదనపు షోకు ఉదయం 5 గంట ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరోవైపు, సింగిల్స్‌ స్క్రీన్స్ లో జీఎస్టీతో కలిపి రూ.75, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఆగస్టు 14 నుంచి ఆగస్టు 23 వరకూ ఈ ధరలు అమల్లో ఉంటాయి.

మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్‌...

యువ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు రజనీకాంత్‌. కూలీ విడుదల కానుండగా, మరో వైపు ‘జైలర్‌ 2’ షూటింగ్‌ జరుగుతోంది. అయితే తాజాగా ఆయన మరో కథకు ఓకే చెప్పారని తెలిసింది. నటుడు, దర్శకుడు ఎం.శశి కుమార్‌ ఇటీవల రజనీకాంత్‌ ని కలిసి ఓ కథ చెప్పారని, ఈ ప్రాజెక్ట్‌ దాదాపు ఖాయమని కోలీవుడ్‌ మీడియా చెబుతోంది. శశి కుమార్‌ ఇటీవల ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’ సినిమాలో ప్రదాన పాత్ర పోషించారు. నటుడిగా చేస్తూనే దర్శకత్వం కూడా చేస్తుంటారు. ఇప్పుడు రజనీకాంత్‌ని డైరెక్ట్‌ చేయాలన్నది శశికుమార్‌ కల.

అందుకోసం కొన్నాళ్లుగా స్క్రిప్ట్ పై  వర్క్‌ చేస్తున్నారు. ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’ తర్వాత హీరోగా అవకాశాలు వస్తున్నా.. వాటిని పక్కన పెట్టి రజనీకాంత్‌ కోసం కథపై ఫోకస్‌ చేస్తున్నారు. ఇప్పుడు ఆ పనులు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. రజనీని కలిసి కథ వినిపించడం, అది రజనీకి నచ్చడంతో ఈ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ దొరికింది. రజనీ మరిన్ని కథలు విన్నారు. జైలర్‌ తర్వాత ఏ సినిమా చేస్తారన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ శశి అనుకున్నట్లు జరిగితే ఈ సినిమానే పట్టాలెక్కించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Updated Date - Aug 12 , 2025 | 09:47 PM