Shashtipoorthi Trailer: లేడీస్ టైలర్ జంట.. షష్టిపూర్తి ట్రైలర్ వచ్చేసింది
ABN , Publish Date - May 25 , 2025 | 08:23 AM
రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'షష్టిపూర్తి'.
రూపేష్ (Rupeysh), ఆకాంక్ష సింగ్ (Aakanksha Singh) హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'షష్టిపూర్తి' (Shashtipoorthi). ఈ సినిమాతో పవన్ ప్రభ దర్శకునిగా పరిచయమవుతుండగా సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్ (RajendraPrasad), అర్చన (Archana) కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. ‘మా ఆయి (MAA AAIE) ప్రొడక్షన్స్‘ పతాకం పై రూపేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ్యాస్ట్రో ఇళయరాజా (Ilayaraja) సంగీతం అందిస్తున్నాడు.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 30న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటలు ఒకదాన్ని మించి మరోటి మంచి స్పందనను రాబట్టాయి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ప్రత్యేక ఈవెంట్ నిర్వహించి మూవీ ట్రైలర్ విడుదల చేశారు.