Rajamouli Praises: వారిద్దరూ చెబితే తిరుగుండదు
ABN , Publish Date - Jul 17 , 2025 | 06:03 AM
వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా రాధాకృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘జూనియర్’. శ్రీలీల హీరోయిన్. జెనీలియా, రావు రమేశ్ కీలక పాత్రలు పోషించారు...
వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా రాధాకృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘జూనియర్’. శ్రీలీల హీరోయిన్. జెనీలియా, రావు రమేశ్ కీలక పాత్రలు పోషించారు. సాయి శివానీ సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మించారు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ ‘‘సాయి ఈ సినిమాను ప్రారంభించినప్పుడు మొదట చిన్న ప్రాజెక్ట్ అనుకున్నాను. కానీ ఇప్పుడు దీనిని ఇంత పెద్ద చిత్రంగా మార్చారు. ‘ఈ అబ్బాయి బాగా చేశాడు’ అని పీటర్ హెయిన్స్, కె.కె.సెంథిల్‌కుమార్ చెప్పేవారు. వారిద్దరూ అలా ఒకరి గురించి చెప్పారంటే ఆ వ్యక్తికి ఇండస్ట్రీలో తిరుగుండదు. దర్శకుడు రాధాకృష్ణ ఎంతో కష్టపడి ఈ సినిమా తెరకెక్కించారు. ఆయన గొప్ప విజయం అందుకుంటారని ఆశిస్తున్నాను. ఇది ఓ పైసా వసూల్ ఎంటర్టైనర్ అవుతుంది’’ అని అన్నారు. ‘‘ఈ సినిమాలో ఒక యాక్షన్ సన్నివేశం ఉంటుంది. అలాంటిది భారతీయ సినిమాల్లో ఇంతవరకూ చూసి ఉండరు’’ అని కిరీటి రెడ్డి తెలిపారు.