Globetrotter: రామోజీ ఫిల్మ్‌ సిటీలో గ్లోబ్‌ ట్రోటర్‌ భారీ ఈవెంట్‌..

ABN , Publish Date - Nov 02 , 2025 | 05:45 PM

రాజమౌళి పబ్లిసిటీ స్ట్రాటజీనే వేరు.. ఆయన ఏం చేసిన అందులో కొత్తదనం ఉంటుంది. మహేశ్‌బాబు, రాజమౌళి.. ఇద్దరూ వరుస ట్వీట్‌లతో శనివారం సోషల్‌ మీడియాను షేక్‌ చేశారు.

రాజమౌళి (SS Rajamouli) పబ్లిసిటీ స్ట్రాటజీనే వేరు.. ఆయన ఏం చేసిన అందులో కొత్తదనం ఉంటుంది. మహేశ్‌బాబు, రాజమౌళి.. ఇద్దరూ వరుస ట్వీట్‌లతో శనివారం సోషల్‌ మీడియాను షేక్‌ చేశారు. ‘నవంబర్‌ నెలలో సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ ఇస్తానన్నారు.. ఎప్పుడూ’ అంటూ మహేశ్‌(mahesh)రాజమౌళిని ప్రశ్నించారు. తాజా సమాచారం ప్రకారం రాజమౌళి ఈ సినిమా కోసం భారీ ఈవెంట్‌ ప్లాన్‌ చేశారు. సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ను జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్ అయ్యేలా ప్లాన్‌ చేశారు. గ్లోబ్‌ ట్రోటర్‌ (globe trotter) ఈవెంట్‌ను నవంబర్‌ 15 సాయంత్రం ఆరు గంటల నుంచి రామోజీ ఫిలిం సిటీలో ప్లాన్‌ చేశారు రాజమౌళి. దీనికి సంబందించిన ప్రొమోను ఉమెన్స్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా ప్రదర్శిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మహేష్‌ బాబుతోపాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌తోపాటు మరికొందరు స్టార్స్‌ పాల్గొంటారని తెలిసింది.

Globe.jpeg
మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే నాలుగు షెడ్యూల్లు పూర్తయింది. ఒరిస్సా, కెన్యా వంటి ప్రదేశాల్లో ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకుంది. నైరోబి, టాంజానియాల్లో కొత్త షెడ్యూల్‌ కోసం ప్లాన్‌ చేస్తున్నారు.  శ్రీ దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కె.ఎల్‌.నారాయణ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2027 ప్రారంభంలో విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు.  

Updated Date - Nov 02 , 2025 | 05:45 PM