SS Rajamouli: జై మహిష్మతి.. ప్రసాద్ ఐమ్యాక్స్‌లో రాజమౌళి సందడి
ABN , Publish Date - Oct 30 , 2025 | 09:51 PM
హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ‘బాహుబలి – ది ఎపిక్’ ప్రీమియర్ సందర్భంగా దర్శకుడు రాజమౌళి అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. “జై మహిష్మతి” అంటూ ఆడియన్స్‌ను ఉత్సాహపరిచారు.
దేశ ఔన్నత్యాన్ని ప్రపంచం నలుమూలల చాటిన తెలుగు చిత్రం బాహుబలి రెండు భాగాలను ఒకటిగా చేసి బాహుబలి ఎపిక్‌గా ఈ రోజు (ఆక్టోబర్ 30)న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో జరిగిన ‘బాహుబలి – ది ఎపిక్’ ప్రీమియర్ షోలో దర్శకధీరుడు రాజమౌళి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ.. “బాహుబలి విడుదలై దాదాపు పదేళ్లు అయినా ఈ చిత్రంపై అభిమానుల ప్రేమ, ఆసక్తి తగ్గలేదు. ఇది పూర్తిగా మీ అందరి వల్లే సాధ్యమైంది,” అని రాజమౌళి పేర్కొన్నారు.
అలాగే, “మీ ప్రేమ, మద్దతుతోనే మళ్లీ ఈ మహాకావ్యాన్ని పెద్ద తెరపైకి తీసుకువచ్చాం. పదేళ్లుగా మీరు చూపుతున్న ఆదరణకు హృదయపూర్వక ధన్యవాదాలని చెప్పారు. చివరగా ఆయన జై మహిష్మతి అంటూ ప్రేక్షకులలో ఉత్సాహాన్ని రగిలించారు.