SS Rajamouli: ఇండియన్‌ ఆర్మీ ఫొటోలు, వీడియోలు తీయవద్దు..

ABN, Publish Date - May 09 , 2025 | 04:12 PM

భారత్‌ - పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి స్పందించారు. పాజిటివ్‌గా, అప్రమత్తంగా ఉంటే విజయం మనదే అన్నారు.

భారత్‌ - పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) స్పందించారు. పాజిటివ్‌గా, అప్రమత్తంగా ఉంటే విజయం మనదే అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. ‘‘ఒకవేళ భారత సైనిక చర్యలను చూస్తే. ఫొటోలు, వీడియోలు తీయొద్దు. వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయొద్దు. అలా చేేస్త.. శత్రువుకు సాయం చేసినట్టే అవుతుంది. అనధికారిక ప్రకటనలు, అసత్య ప్రచారం నమ్మకండి’’ అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.  

ఈ మేరకు హీరోయిన్‌ రష్మిక మందన్నా (Rashmika Mandanna) కూడా స్పందించారు. శాంతిని కోరుకోవడమంటే.. హానిని అంగీకరించడం కాదని ఆమె అన్నారు. అన్యాయానికి బదులు తీర్చుకునే దేశాన్ని ప్రశ్నించవద్దంటూ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు.

‘‘ఉగ్రవాదం నుంచి మనల్ని రక్షించుకునేందుకు చేసే  పోరాటం యుద్థం కాదు. ఈ పోరాటానికి మద్దతిచ్చే వారిని యుద్థాన్ని కాంక్షించే వారిగా పేర్కొనొద్దు. దేశ భద్రత, న్యాయం కోసం ఆరాటపడే పౌరులు వారు. దూకుడు ధోరణి, అత్యవసర ఆత్మరక్షణకు మధ్య చాలా నైతిక భేదం ఉంటుంది. కుట్రపూరితంగా జరిగిన ఉగ్రవాద చర్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయినప్పుడు.. దానికి ప్రతీకారం తీర్చుకోవడం అనేది బాధ్యతే అవుతుంది తప్ప.. అవకాశం కాదు. శాంతిని కోరుకోవడమంటే అర్థం.. జరిగిన హానిని మౌనంగా అంగీకరించడం కాదు. మనకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకుంటున్న దేశాన్ని ప్రశ్నించొద్దు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిని ప్రశ్నించండి’’ అని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఇదిలా ఉండగా సాయుధ దళాలకు సాయం చేసేందుకు విజయ్‌ దేవరకొండ ముందుకొచ్చారు. తన రౌడీ బ్రాండ్‌ దుస్తులు వారికి అందించనట్టు ప్రకటించారు.

Updated Date - May 09 , 2025 | 04:12 PM