Raj Tharun: కాపాడే వాడే చంపడం మొదలు పెడితే...

ABN , Publish Date - Nov 17 , 2025 | 04:19 PM

రాజ్ తరుణ్‌ నటించిన 'పాంచ్ మినార్' ఈ నెల 21న విడుదల కాబోతోంది. ఈ లోగా అతని మరో సినిమా 'టార్టాయిస్' పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఇందులో అమృతా చౌదరి రాజ్ తరుణ్‌ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

Raj Tarun Tortoise movie opening

ఈ యేడాది కాస్తంత ఆలస్యంగా రాజ్ తరుణ్‌ (Raj Tharun) నటించిన 'చిరంజీవ' (Chiranjeeva) సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం మొదలైంది. ఇక రాబోయే 21వ తేదీన 'పాంచ్ మినార్ ' (Panch Minar) మూవీ థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే రాజ్ తరుణ్ తమిళ దర్శకుడు విజయ్ మిల్టన్ ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్‌ హీరోగా కొత్త సినిమా ఒకటి మొదలైంది. అదే 'టార్టాయిస్' (Tortoise). రాజ్ తరుణ్‌, అమృత చౌదరి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్ (Avasarala Srinivas), ధన్య బాలకృష్ణ (Dhanya Balakrishna) ముఖ్యపాత్రలు పోషించబోతున్నారు. రిత్విక్ కుమార్ దర్శకత్వంలో శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి, రామిశెట్టి రాంబాబు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. సోమవారం ప్రసాద్ ల్యాబ్ లో పూజా కార్యక్రమాలు పూర్తయిన వెంటనే దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాకు ఆస్కార్ విజేత చంద్రబోస్ (Chandrabose) పాటలు రాస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.


GANI0759.JPG

ఈ సందర్భంగా రాజ్ తరుణ్ మాట్లాడుతూ 'టార్టాయిస్' అనే ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. చాలా డిఫరెంట్ స్టోరీ. దర్శకుడు రిత్విక్ కుమార్ కథ చెప్పిన విధానం చాలా బాగా నచ్చింది. ఇంత మంచి కథతో వస్తున్నా మా నిర్మాతలకు థ్యాంక్స్. ఈ చిత్రం నా కెరీర్ కి మంచి కిక్ ఇస్తుంది' అని తెలిపారు. రిత్విక్ కుమార్ మాట్లాడుతూ "ఇది రాజ్ తరుణ్ కెరీర్ లో బెస్ట్ సినిమా అవుతుంది. శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణతో పాటు హీరోయిన్ అమృత చౌదరి క్యారెక్టర్ కూడా చాలా బలంగా ఉంటుంది. కొత్త స్క్రీన్ ప్లే తో డిఫరెంట్ కథ తో రాబోతున్న థ్రిల్లర్ చిత్రం ఇది. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం' అని చెప్పారు. 'పగలు రాత్రి కలవకూడదు అన్నది దైవ నిర్ణయం అయితే, కత్తి తో చావును కలపాలన్నది మానవ నిర్ణయం. రాత్రి జరిగే హత్యలకి సాక్ష్యం ఈ చంద్రుడు. వాడు ఎప్పటికి సాక్షిగా రాడు. కష్టాల్లో వున్న వాళ్ళని కాపాడే వాడే కథానాయకుడు. కానీ ఆ కాపాడే వాడే చంపడం మొదలు పెడితే' అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కబోతోంది.

Also Read: Trisha Krishnan: విజయ్ తో పెళ్లి రూమర్స్.. అసహ్యమేస్తుందన్న త్రిష

Also Read: Rasha Thadani: జయకృష్ణ కోసం బాలీవుడ్‌ బ్యూటీ..

Updated Date - Nov 17 , 2025 | 04:28 PM