Raj Tarun: నా కష్టాలు చూసి.. థియేటర్‌లో ఆడియన్స్ కి నవ్వొస్తుంది
ABN , Publish Date - Nov 17 , 2025 | 09:24 AM
రాజ్ తరుణ్ (Raj Tarun) హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పాంచ్‌మినార్’.
రాజ్ తరుణ్ (Raj Tarun) హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పాంచ్‌మినార్’(Paanch Minar). రాశీ సింగ్ (Rashi Singh) హీరోయిన్. ఎంఎ్‌సఎం రెడ్డి నిర్మించారు. ఈ నెల 21న విడుదలవుతోంది. ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా రాజ్‌తరుణ్ మాట్లాడుతూ ‘క్రైమ్, అపరాధ పరిశోధనాత్మక కథనంతో రూపొందిన చిత్రమిది.
అందమైన ప్రేమకథకు మిస్టరీ ఎలిమెంట్స్ జోడించి దర్శకుడు తెరకెక్కించారు. నేటి పరిస్థితులకు అద్దం పట్టేలా ఉంటుంది’ అని చెప్పారు. రామ్ మాట్లాడుతూ ‘రివేంజ్ స్టోరీతో సాగే థ్రిల్లింగ్ ప్రేమకథ ఇది. ప్రథమార్థం అంతా వినోదాత్మకంగా, ఉల్లాసంగా నడుస్తుంది. నేను కష్టాలు పడుతుంటే.. థియేటర్ లో ఆడియన్స్ కి నవ్వొస్తుందని అన్నారు.
ద్వితీయార్థంలో పతాక సన్నివేశాల్లో భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి’ అని అన్నారు. కుటుంబంతో కలసి చూసేలా మా సినిమా ఉంటుంది, నా పాత్ర విభిన్నంగా ఉంటుంది’ అని రాశీసింగ్ చెప్పారు. మంచి నిర్మాణ విలువలతో తెరకెక్కించాం అని నిర్మాత తెలిపారు.