Samantha: సమంత పక్కన కూర్చోవాలంటే సిగ్గేసింది.. రాజ్ పిన్ని వ్యాఖ్యలు వైరల్

ABN , Publish Date - Dec 06 , 2025 | 08:53 PM

ఎట్టకేలకు స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఒక ఇంటి కోడలిగా మారింది. అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya)తో విడాకుల తరువాత సింగిల్ గానే ఉండిపోతుందేమో అని అందరూ భయపడ్డారు.

Samantha

Samantha: ఎట్టకేలకు స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఒక ఇంటి కోడలిగా మారింది. అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya)తో విడాకుల తరువాత సింగిల్ గానే ఉండిపోతుందేమో అని అందరూ భయపడ్డారు. కానీ, సామ్ కొద్దిగా గ్యాప్ తీసుకొని.. తనకు నచ్చిన మరో వ్యక్తిని వివాహమాడింది. ఆ వ్యక్తి ఎవరో కాదు రాజ్ నిడిమోరు (Raj Nidimoru). బాలీవుడ్ డైరెక్టర్ అని చెప్పుకుంటున్నా కూడా రాజ్ తెలుగువాడు. ఈ విషయం చాలా తక్కువమందికి తెలుసు. ఇక వీరి పెళ్లి ఈషా ఆశ్రమంలో చాలా సింపుల్ గా అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. ఆ సన్నిహితులతో రాజ్ తల్లి రమాదేవి సోదరి, పద్మశ్రీ అన్నమయ్య పదకోకిల డా. శోభా రాజు హాజరయ్యింది. ఇక మొదటిసారి రాజ్ - సమంత పెళ్లి తరువాత ఆమె ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఇక ఈ ఇంటర్వ్యూలో శోభా రాజు.. తన అక్క కొడుకు రాజ్ నిడిమోరు గురించి, సమంత గురించి ఎన్నో విశేషాలను పంచుకుంది. చిన్నతనం నుంచి కూడా రాజ్ చాలా యాక్టివ్ గా ఉండేవాడని, సాంగ్స్ కూడా పాడేవాడని చెప్పుకొచ్చింది. తన అక్క రమాదేవి.. ఈ పెళ్ళికి రావాలని గట్టిగా చెప్పిందని, రాజ్ కూడా కచ్చితంగా పిన్ని మీరు కూడా పెళ్ళిలో ఉండాలని చెప్పడంతో తాను కూడా వెళ్లినట్లు తెలిపింది. పెళ్లి చాలా బాగా జరిగిందని, సమంత చాలా మంచి అమ్మాయని చెప్పుకొచ్చింది.

ఇక సమంత పెళ్లి అనుకోకముందే రెండు మూడుసార్లు కలిసినట్లు తెలిపిన శోభా రాజు.. మొదటిసారి సామ్ ను చూసినప్పుడు చాలా సన్నగా ఉందని, ఆమె పక్కన కూర్చుంటే నాకే సిగ్గేసిందని తెలిపింది. ఇలా సన్నగా అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగితే డైట్, వర్క్ అవుట్స్ చెప్పిందని కూడా చెప్పుకొచ్చింది. సమంత చాలా దైవ భక్తి గల అమ్మాయి.. మూడు నెలలకు ఒకసారి ఈషా ఆశ్రమానికి వెళ్లి మెడిటేషన్ చేస్తుంది. అలా ఒక్కసారి కూర్చుంటే మూడు గంటల వరకు లేవదట. మా కుటుంబంలోకి ఆమె రావడం ఎంతో సంతోషం. వారిద్దరూ కూడా మంచి మంచి సినిమాలు నిర్మించి.. మంచిగా ఎదగాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపింది.

Updated Date - Dec 06 , 2025 | 09:15 PM