Gedela Raju: రఘుకుంచె : 'గేదెల రాజు.. కాకినాడ తాలుకా

ABN , Publish Date - Jun 13 , 2025 | 08:16 PM

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ పాత్ర పోషిస్తున్న చిత్రం ‘గేదెల రాజు’. కాకినాడ తాలుకా అనేది ఉపశీర్షిక.

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె (Raghu kunche) టైటిల్‌ పాత్ర పోషిస్తున్న చిత్రం ‘గేదెల రాజు’.. కాకినాడ తాలుకా (Gedele Raju Kakinada thaluka) అనేది ఉపశీర్షిక. చైతన్య మోటూరి దర్శకత్వంలో వాణికుమార్‌ మోటూరి నిర్మిసున్నారు. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది శుక్రవారం రఘు కుంచె పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఆయన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

Gedelaaa.jpg

ఇందులో రఘు లుక్‌ ఫెరోషియష్‌ ఉంది. ‘‘చూస్తే ఒకటే నిజం చూడకపోతే వంద అనుమానాలు’’ అనే ఒక నిజాన్ని ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తునట్లు చిత్ర యూనిట్‌ చెప్పింది. మోటూరి టాకీస్‌ పతాకంపై రఘుకుంచే సమర్పిస్తున్న చిత్రమిది.

Updated Date - Jun 13 , 2025 | 08:40 PM