Allu Arjun: ఫ్యాన్స్ కోసం.. మళ్లీ అదే పని చేయబోతున్న మేకర్స్
ABN , Publish Date - Jun 04 , 2025 | 09:04 PM
అల్లు అర్జున్(Allu Arjun) హిట్ సినిమా ఒకటి రీరిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే బన్నీ పాత సినిమాలు రీరిలీజ్ అయ్యి ఎంత రచ్చ చేశాయో తెల్సిందే.
ఈ మధ్యకాలంలో కొత్త సినిమాల కంటే పాత సినిమాలే ఎక్కువ ట్రెండ్ సృష్టిస్తున్నాయి. గత కొంతకాలంగా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల హవా నడుస్తున్న విషయం తెల్సిందే. అభిమానుల పల్స్ తెలుసుకున్న మేకర్స్.. హీరో బర్త్ డే వచ్చింది అంటే రీరిలీజ్, ఏదైనా పండగ వచ్చిందంటే రీ రిలిఙ్.. హీరో కొత్త సినిమా రిలీజ్ కానుందా.. దానికి హైప్ పెంచడానికి రీరిలీజ్ చేస్తూ క్యాష్ చేసుకుంటూనే ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు.
తాజాగా అల్లు అర్జున్(Allu Arjun) హిట్ సినిమా ఒకటి రీరిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే బన్నీ పాత సినిమాలు రీరిలీజ్ అయ్యి ఎంత రచ్చ చేశాయో తెల్సిందే. ఇక ఇప్పుడు ఆ లిస్ట్ లోకి రేసుగుర్రం కూడా యాడ్ అవ్వబోతుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు లో రేసుగుర్రం(Race Gurram) రీరిలీజ్ కానుందని తెలుస్తోంది. అయితే ఇప్పట్లో అల్లు అర్జున్ బర్త్ డే లేదు.. వేరే పండగ లాంటిది కూడా ఏది లేదు. ఇప్పుడెందుకు ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు అంటే.. పుష్ప 2(Pushpa 2) తరువాత బన్నీ వరుస సినిమాలతో బిజీగా మారాడు.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) దర్శకత్వంలో బన్నీ ఒక సినిమా చేస్తున్నాడు. ఇది కాకుండా త్రివిక్రమ్(Trivikram) తో మరో మూవీ చేస్తున్నాడు. పుష్ప 2 తరువాత త్రివిక్రమ్ సినిమాను పట్టాలెక్కించాలనుకున్నారు కానీ, కొన్ని కారణాల వలన ముందు అట్లీ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లారు. పాన్ ఇండియా సినిమా కావడంతో పాటు ఎక్కువ విఎఫ్ఎక్స్ వర్క్ ఉన్న సినిమా కావడంతో ఎంత లేదనుకున్నా రిలీజ్ అవ్వడానికి ఏడాది అయినా పడుతుంది. అంటే ఏడాది వరకు బన్నీ.. బిగ్ స్క్రీన్ మీద కనిపించడు. అందుకే ఈలోపు ఫ్యాన్స్ లో ఉత్సాహం తెప్పించడానికి రేసుగుర్రం రీరిలీజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read: Body Doubles: హీరోస్ బాడీ డబుల్స్ తో ట్రబుల్స్!
బన్నీ కెరీర్ లో టాప్ హిట్ సినిమాల లిస్ట్ లో రేసుగుర్రం కూడా ఉంటుంది. సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వం వహించిన ఈ సినిమా 2014 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో బన్నీ నటనకు ఫిదా కానీ వారుండరు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందించాడు. మరి బన్నీ ఫ్యాన్స్.. రేసుగుర్రం సినిమా రీరిలీజ్ కు ఎలాంటి హంగామా చేస్తారో చూడాలి.