Raai lakshmi: స్పోర్ట్స్‌ అధికారుల హెరాస్‌మెంట్‌కు చరమగీతం..

ABN , Publish Date - Nov 22 , 2025 | 01:44 PM

రాయ్‌లక్ష్మీ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘జనతాబార్‌’. రోచి మూవీస్‌ పతాకంపై రమణ మొగిలి స్వీయ దర్శకత్వంలో అశ్వర్థ నారాయణ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు చివరికి చేరుకున్నాయి.

రాయ్‌లక్ష్మీ (Raai Lakshmi) ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘జనతాబార్‌’ (janata bar). రోచి మూవీస్‌ పతాకంపై రమణ మొగిలి (Ramana Mogili) స్వీయ దర్శకత్వంలో అశ్వర్థ నారాయణ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు చివరికి చేరుకున్నాయి. ఈ నెల 28న ఆ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. దర్శక, నిర్మాత రమణ మొగలి మాట్లాడుతూ ‘స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకున్న మహిళలపై ఆ స్పోర్ట్స్‌ విభాగం ఉన్నతాధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్న సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌కు చరమగీతం పాడటానికి పోరాడిన ఓ మహిళ కథ ఇది.

మహిళా ప్రాధాన్యం గల ఈ చిత్రంలో లక్ష్మీ రాయ్‌ పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపిస్తారు. పూర్తి కమర్షియల్‌ అంశాలతో పాటు సమాజానికి మంచి సందేశం ఇస్తూ, మహిళల్లో చైతన్యం నింపేలా ఈ సినిమా ఉంటుంది. బాలీవుడ్‌ నటుడు శక్తికపూర్‌ ఈ చిత్రంలో ఎంతో కీలక పాత్రను పోషించాడు. తప్పకుండా ఈచిత్రం కమర్షియల్‌గా మంచి విజయం సాధింస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు. అమన్‌ ప్రీత్‌సింగ్‌, దీక్షపంత్‌, శక్తికపూర్‌, అనూప్‌సోని, ప్రదీప్‌రావత్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వినోద్‌ యజమాన్య.   


Updated Date - Nov 22 , 2025 | 01:48 PM