Pushpa Raj x Sheelavathi Audio Call: ఘాటీతో.. పుష్పరాజ్! అల్లు అర్జున్‌కు.. ఫోన్ చేసిన అనుష్క
ABN , Publish Date - Sep 04 , 2025 | 04:56 PM
స్విటీ అనుష్క కాస్త విరామం తర్వాత నటించిన చిత్రం ఘాటి. అయితే అనుష్క ఎక్కడా ప్రత్యక్షంగా ప్రమోషన్లలో పాల్గొనకుండా కొత్త పుంతలో ప్రచారం చేస్తూ జనంలోకి తీసుకెళుతుంది.
స్విటీ అనుష్క (Anushka) కాస్త విరామం తర్వాత నటించిన చిత్రం ఘాటి (Ghaati). క్రిష్ జాగర్లమూడి (Krish) దర్శకత్వంలో వస్తున్నన ఈ చిత్రం కావడంతో సర్వత్రా అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ప్రచార కార్యక్రమాలు సైతం గట్టిగానే చేస్తున్నారు. అయితే అనుష్క ఎక్కడా ప్రత్యక్షంగా ప్రమోషన్లలో పాల్గొనక పోవడం కాస్త ఇబ్బందిగా మారిన కొత్త పుంతలో ప్రచారం చేస్తూ జనంలోకి తీసుకెళుతుంది.
ఈ క్రమంలో ఇటీవల రానాతో ఫోన్ కాల్‌త్ ఒక్కసారిగా షాక్ ఇచ్చిన అనుష్క తాజాగా పుష్ఫ (PUSHPA RAJ) అల్లు అర్జున్‌తో (Allu Arjun) ఫోన్‌లో మాట్లాడింది. ఇప్పుడు ఈ వీడియో బయటకు రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో బాగా వైరల్ వుతుంది.ఈ ఫోన్ కాల్‌లో.. చాలా జోవిలయల్‌గా మాట్లాడుతూ శ్రోతలకు మంచి ఎంటర్టైన్ మెంట్ ఇచ్చారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ అనుష్కకు బెస్ట్ విషెస్ చెప్పడమే కాక నిన్ను స్విటీ అని పిలవాలా లేక ఘాటీ అని పిలవాలా అంటూ ఆట పట్టించాడు. సినిమా నుంచి డైలాగ్ చెప్పాలని, ఇంకా పుష్ఫ, ఘాటీ క్రాస్ ఓవరా టాక్ వస్తుంది పుష్ప ,శిలావతి కలిస్తే ఎలా ఉంటుందనే ఐడియా బావుంది, సుకుమార్, క్రిష్‌ను కలిసి ఫ్లాన్ చేయమని చెబుదాం అంటూ ఒక్క సారిగా హై ఇచ్చారు.