Pushpa 2: వెనక్కి తగ్గిన పుష్ప రాజ్.. 'గేమ్ ఛేంజర్' ఎఫెక్ట్?
ABN , Publish Date - Jan 09 , 2025 | 11:20 AM
Pushpa 2: మరోవైపు ఇప్పటికే ఈ సినిమా రన్ టైమ్ 3 గంటల 17 నిమిషాలతో ప్రేక్షకుల సహనానికి పరీక్షా పెట్టింది. దీనికి మరో 20 నిమిషాలు యాడ్ చేయడంతో ఆడియెన్స్ ఎలా రియాక్ట్ అవుతారో అనేది ఆసక్తిగా మారింది.
బాక్సాఫీస్ వద్ద పుష్ప రాజ్ దాహం తీరినట్లు కనిపించడం లేదు. ఇప్పటికే హయ్యెస్ట్ కలెక్షన్స్ చేసిన రెండవ ఇండియన్ సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు రాజమౌళి 'బాహుబలి 2' సినిమా పేరు మీదున్న రికార్డులన్నీ బ్రేక్ చేసింది. తాజాగా రూ. 1800 కోట్ల కలెక్షన్ ని దాటింది. ఇప్పుడు రూ. 2000 కోట్ల మార్కును దాటినా ఒకే ఒక ఇండియన్ సినిమా 'దంగల్' రికార్డులను బ్రేక్ చేసేందుకు మేకర్స్ నానా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇందులో భాగంగానే 'పుష్ప 2' సినిమాకు అదనంగా 20 నిమిషాలు యాడ్ చేసి రీలోడెడ్ వెర్షన్ ను జనవరి 11 నుండి థియేటర్లలో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. దీంతో ఈ సినిమాకి రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మధ్య పోటీ ఏర్పడుతుందని అంత భావించారు. కానీ.. చివరకు పుష్ప టీమ్ జనవరి 11 నుండి 17కు షిఫ్ట్ అయ్యింది. ఇదంతా గేమ్ ఛేంజర్ తో పోటీ తట్టుకోలేకే అని కొందరు అభిప్రాయపడుతున్న.. మైత్రీ మూవీస్ మేకర్స్ మాత్రం టెక్నీకల్ ఇష్యూస్ వల్లే వెన్నకి తగ్గినట్లు ప్రకటించారు. మరోవైపు ఇప్పటికే ఈ సినిమా రన్ టైమ్ 3 గంటల 17 నిమిషాలతో ప్రేక్షకుల సహనానికి పరీక్షా పెట్టింది. దీనికి మరో 20 నిమిషాలు యాడ్ చేయడంతో ఆడియెన్స్ ఎలా రియాక్ట్ అవుతారో అనేది ఆసక్తిగా మారింది.
ఇక ఈ సినిమా కథ విషయానికిస్తే.. ఎర్రచందనం కూలీగా కెరీర్ మొదలుపెట్టి సిండికేట్‌ని, రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతాడు పుష్పరాజ్ (అల్లు అర్జున్). అధికార పార్టీకి సైతం ఫండ్ ఇచ్చే స్థాయికి చేరుకుంటాడు. సీఎంను కలిసి వద్దామని పుష్ప బయలుదేరితే.. ‘వస్తూ వస్తూ సీఎమ్‌తో ఓ ఫొటో తీసుకుని రా’ అంటూ తన భార్య శ్రీవల్లి(రష్మిక) కోరిక కోరుతుంది. (రష్మిక). అయితే స్మగ్లర్లు పార్టీ ఫండ్ ఇచ్చేంత వరకే కానీ ఫొటోలు దిగడానికి కాదని అధికార సీఎం హేళనగా మాట్లాడతాడు. దానిని సీరియస్‌గా తీసుకున్న పుష్ప ఎంపీ సిద్దప్ప (రావు రమేష్)తో ఓ ఫొటో తీసుకొని, తననే ముఖ్యమంత్రిని చేస్తా అని మాట ఇస్తాడు. అందుకోసం రూ.500 కోట్లు ఫండ్ ఇవ్వడానికి సిద్ధపడతాడు. దాని కోసం 2000 టన్నుల ఎర్రచందనం స్మగ్లింగ్ చేయాల్సి వస్తుంది. ఆ స్మగ్లింగ్‌ని ఆపడానికి, తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి భన్వర్ సింగ్ షెకావత్ (ఫహద్ ఫాజల్) ప్రయత్నాలు చేస్తాడు. భన్వర్ సింగ్ షెకావత్‌ని దాటుకొని ఆ 2000 వేల టన్నులు స్మగ్లింగ్ చేయగలిగాడా, లేదా? శ్రీవల్లికి ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకున్నాడు? ఇంటి పేరు, కుటుంబం కోసం పాకులాడే పుష్పకు అది ఎలా దక్కింది? అన్నది కథ.