Pushpa 2: హల్లో జపాన్‌.. రెడీగా ఉన్నారా..

ABN , Publish Date - Dec 04 , 2025 | 01:56 PM

అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప 2: ది రూల్‌’ సినిమా జపాన్‌లో విడుదల కానుంది. ‘పుష్ప కున్రిన్‌’ పేరుతో జపనీస్‌ భాషలో విడుదల చేయడానికి మేకర్స్‌ సర్వ సిద్ధం చేస్తున్నారు.

దర్శకుడు రాజమౌళి, బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాలను జపాన్‌లో విడుదల చేసి తెలుగు సినిమా సత్తాను అక్కడ కూడా చాటారు. స్వయంగా జపాన్‌ వెళ్లి ప్రమోట్‌ చేశారు. అలాగే రజనీకాంత్‌ నటించిన కబాలి చిత్రం కూడా జపాన్‌లో విడుదలైంది. ఇప్పుడు పుష్పరాజ్‌ (Pushpa 2)వంతు వచ్చింది. అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప 2: ది రూల్‌’ సినిమా జపాన్‌లో విడుదల కానుంది. ‘పుష్ప కున్రిన్‌’ పేరుతో జపనీస్‌ (Pushpa 2 in japan) భాషలో విడుదల చేయడానికి మేకర్స్‌ సర్వ సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్ని హీరోయిన్‌ రష్మిక మందన్నా (Rashmika Mandanna) వెల్లడించింది.

‘హల్లో జపాన్‌.. ఇప్పుడు వైల్డ్‌ ఫైర్‌ గ్లోబల్‌ స్థాయిలో రాబోతుంది. ‘పుష్ప’ వచ్చే ఏడాది జనవరి 16 జపాన్‌ సినీ లవర్స్‌ ముందుకు రానుంది! రెడీగా ఉన్నారా? అంటూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టింది.


ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, రష్మిక మందన్న జంటగా సుకుమార్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ‘పుష్ప’ రెండు భాగాలు సూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించాయి. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కు జాతీయ పుర్కసారం కూడా దక్కింది. ఇప్పుడు ఈ చిత్రం జపాన్‌లో కూడా సంచనాలు సృష్టించడానికి రెడీ అవుతోంది. ‘పుష్ప 2: ది రూల్‌’ మూవీ జపాన్‌లో విడుదల కానుందని చాలాకాలంగా వార్తలొస్తున్నాయి. ఇప్పటికీ అధికారికంగా మేకర్స్‌ ప్రకటన చేశారు. ఈ చిత్రంలో జపాన్‌ నేపథ్యం కూడా ఉంది. సినిమాకు కీలకమైన సన్నివేశాలు, కథను మలుపు తిప్పే సీన్స్‌, యాక్షన్స్‌ పార్ట్‌ జపాన్‌ నేపథ్యంలోనే ఉంటుంది. అందుకే జపనీస్‌ ఈ సినిమాకు బాగా కనెక్ట్‌ అవుతారనే ధైర్యంతో మేకర్స్‌ అక్కడ రిలీజ్‌ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. హీరోతో పాటు దర్శకుడు హీరోయిన్‌ కూడా జపాన్‌ వెళ్లి సినిమాను ప్రమోట్‌ చేసే అవకాశం ఉందని తెలిసింది.

Updated Date - Dec 04 , 2025 | 02:12 PM