Purusha: నవ్వించడమే ప్రధాన లక్ష్యం
ABN , Publish Date - Dec 11 , 2025 | 08:21 PM
నవ్వించడమే ప్రధాన లక్ష్యంగా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న చిత్రం ‘పురుష'. మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం అంటూ విడుదల చేసిన పోస్టర్ సినిమా పై ఆసక్తి కలిగించింది.
నవ్వించడమే ప్రధాన లక్ష్యంగా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న చిత్రం ‘పురుష' (purusha). 'మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం' అంటూ విడుదల చేసిన పోస్టర్ సినిమా పై ఆసక్తి కలిగించింది. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు పవన్ కళ్యాణ్ బత్తుల ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రమిది వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌తో పాటుగా ఈ చిత్రంలో కసిరెడ్డి, సప్తగిరి పాత్రలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ వంటి కమెడియన్స్ అందరినీ కడుపుబ్బా నవ్విస్తారని టీం చెబుతోంది.
ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫర్‌గా సతీష్ ముత్యాల, సంగీత దర్శకుడుగా శ్రవణ్ భరద్వాజ్, ఎడిటర్‌గా కోటి, ఆర్ట్ డైరెక్టర్ గా రవిబాబు దొండపాటి పని చేస్తున్నారు.