Puri Musings: ఎడారులను దాటుకుంటూ.. ఇసుక తుఫానుల మధ్య..

ABN , Publish Date - May 06 , 2025 | 03:26 PM

దర్శకుడు పూరి జగన్నాథ్‌ ( Puri Jagannadh) ముక్కుసూటి మనిషి. ఏదైనా కొట్టినట్లు మాట్లాడతారు. సొసైటీలో జరిగే విషయాలపైనా ఆయన అలాగే మాట్లాడతారు. ఇక ఆయన మ్యూజింగ్‌కు ఎంత క్రేజ్‌ ఉందో తెలిసిందే!

దర్శకుడు పూరి జగన్నాథ్‌ ( Puri Jagannadh) ముక్కుసూటి మనిషి. ఏదైనా కొట్టినట్లు మాట్లాడతారు. సొసైటీలో జరిగే విషయాలపైనా ఆయన అలాగే మాట్లాడతారు. ఇక ఆయన మ్యూజింగ్‌కు ఎంత క్రేజ్‌ ఉందో తెలిసిందే! ఏదో ఒక ఆసక్తికర విషయాన్ని తీసుకుని దాని గురించి వివరంగా చెబుతారు. తాజాగా మరో ఆసక్తికర విషయాన్ని ఆయన మ్యూజింగ్‌(Puri Musings) ద్వారా చెప్పారు. ఈసారి సిల్క్‌ రోడ్‌ (SILK ROAD)గురించి వివరించారు.

"చైనా నుంచి యూరప్‌ వరకూ ఒక కనెక్టింగ్‌ రూట్‌ ఉండేది. దాని పేరు సిల్క్‌ రోడ్‌. అప్పట్లో చైనా సిల్క్‌కు యూరప్‌లో విపరీతమైన డిమాండ్‌ ఉండేది. సిల్క్‌ బిజినెస్‌ కోసం ప్రారంభమైన రూట్‌ ఇది. 36 దేశాలను కలుపుతూ 6,400 కిలోమీటర్లు ఆ రోడ్‌ ఉండేది. చైనా, మంగోలియా, కజికిస్థ్థాన్‌, సిరియా, టర్కీ, పాకిస్థాన్‌, ఇరాన్‌, ఇరాక్‌, ఈజిప్ట్‌ ఇలా అన్ని దేశాలు ఆ రోడ్‌కు కనెక్ట్‌ అయి ఉంటాయి. అయితే, ఈ రూట్‌లో వెళ్తే ప్రాణాలతో వస్తారో లేదో ఎవరికీ తెలియదు. అంత ప్రమాదకరంగా ఉంటుంది. ఎందుకంటే ఎన్నో ఎడారులను దాటుకుంటూ వెళ్లాలి. ఇసుక తుఫానుల మధ్య ప్రయాణం చేయాలి. పైగా విపరీతమైన ఉష్ణోగ్రత ఉంటుంది. ఒంటెలు, గుర్రాలు లేకుండా ఎవరూ ప్రయాణం చేయలేరు. చైనా నుంచి టర్కీకి చేరాలంటే ఒక సంవత్సరం పట్టేది. ఈ రోడ్‌ ద్వారా ఇండియా నుంచి సిల్క్‌తో పాటు మసాల, కుంకుమ, దాల్చిన చెక్క, మిరియాలు ఎగుమతి చేసేవారు. చైనా నుంచి ఏనుగు దంతాలు, రోమ్‌ నుంచి బంగారం, వెండి ఎగుమతి చేసేవారు. ఇలా రకరకాల బిజినెస్‌లు జరిగేవి. ఈ రోడ్‌ వల్ల ఇస్లాం బుద్దిజం, క్రిస్టియానిటీ అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి వచ్చేవి ఫస్ట్‌ టైమ్‌ చైనా వాళ్లు పేపర్‌, గన్‌ పౌడర్‌ తయారు చేశారు. వాటిని ప్రపంచమంతా కొనాల్సి వచ్చింది. ఆ రూట్‌ చంఘిజ్‌ ఖాన్‌ ఎంపైర్‌ చేతిలో ఉండేది. వాళ్లే దౌర్జన్యం చేేసవారు. మార్క్‌ పోలో ఈ రూట్‌ను ఉపయోగించుకుంటూ పేపర్‌, బొగ్గు అమ్మడం మొదలుపెట్టారు.

‘‘ఈ రూట్‌ మధ్యలో దోపిడీ దొంగలు దాడి చేసేవారు. వాళ్ల నుంచి తప్పించుకోవడానికి అందరూ వెయ్యి ఒంటెలతో ప్రయాణించేవారు. ఈ రూట్‌లో వ్యాపారం చేయాలంటే కత్తి పట్టుకొని బయల్దేరాలి. 1500 సంవత్సరాలపాటు ప్రపంచమంతా ఈ దారినే ఉపయోగించింది. ఈ రూట్‌లో బిజినెస్‌ చేయడానికి అందరూ ఒక ప్రత్యేక భాష ఉపయోగించేవారు. దాని పేరు మాలి. ఆ తర్వాత సముద్రమార్గం కనిపెట్టడం వల్ల ఈ సిల్క్‌ రోడ్డు ప్రయాణాన్ని తగ్గించేశారు. వరల్డ్‌ గ్లోబలైజేషన్‌కు మొదటి కారణం ఈ సిల్క్‌ రూటే. సంస్కృతి, టెక్నాలజీ, మతాలు ఇలా ఎన్నో అంశాలు అందరూ ఎక్స్‌ఛేంజ్‌ చేసుకునేవారు. ఇప్పటికీ కొంతమంది ట్రావెలర్స్‌ ఈ సిల్క్‌ రోడ్‌లో ప్రయాణం చేస్తున్నారు’’ అని తెలిపారు.

Updated Date - May 06 , 2025 | 03:26 PM