RIP: నిర్మాత 'తేనెటీగ రామారావు' ఇకలేరు

ABN, Publish Date - May 04 , 2025 | 04:55 PM

టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నిర్మాత జవ్వాజి వెంకట రామారావు అలియాస్ తేనెటీగ రామారావు (68) కన్నుమూశారు.


టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నిర్మాత జవ్వాజి వెంకట రామారావు (Javvaji Venkata ramarao) అలియాస్ తేనెటీగ రామారావు (68)(theneteega ramarao is no more) కన్నుమూశారు. రామారావు గత కొంతకాలంగా లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.  ఆదివారం మధ్యాహ్నం  హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.  ఈయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 

రాజేంద్రప్రసాద్ తో 'తేనెటీగ', వంశీ దర్శకత్వంలో నరేష్ - వాణి విశ్వనాధ్ లతో  'ప్రేమ & కో', శివకృష్ణతో 'బొబ్బిలివేట', 'బడి' వంటి స్ట్రెయిట్ సినిమాలతోపాటు... పలు డబ్బింగ్ చిత్రాలను అయన నిర్మించారు.  

Updated Date - May 04 , 2025 | 04:55 PM