The Raja Saab: రాజా సాబ్ ఓటీటీ డీల్.. థియేటర్ ఇంపాక్టే ముఖ్యమన్న నిర్మాత

ABN , Publish Date - Dec 21 , 2025 | 05:46 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న 'ద రాజా సాబ్ (The Raja Saab)' సినిమాకు సంబంధించిన వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతున్నాయి.

The Raja Saab

The Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న 'ద రాజా సాబ్ (The Raja Saab)' సినిమాకు సంబంధించిన వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతున్నాయి. ఈ సినిమా ఆర్థిక పరమైన విషయాలు ఇంకా క్లియర్ కాలేదని ప్రచారం జరగడంతో, చిత్ర నిర్మాత టి.జి విశ్వ ప్రసాద్ (TG Viswaprasad) స్పందించారు. ఆర్థిక పరమైన అన్ని విషయాలను ఇప్పటికే పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. తాజాగా 'రాజా సాబ్' ఓటీటీ డీల్ పై నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. 'రాజా సాబ్ కు అనుకున్నంత పెద్ద నెంబర్ నాన్ థియేటర్ రైట్స్ నుంచి రాలేదు. కానీ మార్కెట్ అలా ఉంది కాబట్టి దానికి అనుగుణంగానే మేం అమ్మకం చేశాం. అయినా సినిమా బాక్సాఫీస్ దగ్గర రాజా సాబ్ అద్భుత విజయం. మేము ప్రొడక్షన్ ఖర్చులను బయటపెట్టలేం. మాకు, అభిమానులకు థియేటర్ ఇంపాక్టే ముఖ్యం. సినిమా విడుదల తర్వాత స్క్రీన్లే మాట్లాడతాయి. రాజా సాబ్ కలెక్షన్లను అధికారికంగా ప్రకటిస్తాం' అని వెల్లడించారు. అలానే రాజా సాబ్ కు వచ్చిన నాన్-థియేట్రికల్ వాల్యూయేషన్ ప్రస్తుత మార్కెట్‌లో హైయెస్ట్ అని టి.జి విశ్వ ప్రసాద్ పేర్కొన్నారు.

రొమాంటిక్ కామెడీ హారర్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో మాళవికా మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో జనవరి 9న ఈ సినిమా విడుదల కానుంది. హారర్ జానర్ కావడం, దర్శకుడు మారుతి ట్రాక్ రికార్డు లాంటి ఒకటి లేదా రెండు కారణాలు ప్రభావం చూపవచ్చేమో కానీ, పాజిటివ్ టాక్ వస్తే 'రాజా సాబ్'ను బాక్సాఫీస్ దగ్గర కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఎంత పోటీ ఉన్నా సరే జనాలను డార్లింగ్ ప్రభాస్ లాగేస్తాడు. ఇప్పటికే టీజర్, రెండు పాటలు విడుదల కాగా.. డిసెంబర్ 27న ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వెంట్ లో అభిమానుల కోసం కొత్త ట్రైలర్ కూడా లాంచ్ చేయనున్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలానే మరో రెండు పాటలు రిలీజ్‌కు ముందే వచ్చేస్తాయి.

ఇక పొంగల్ బరిలో దిగుతున్న 'రాజా సాబ్'కు మెగాస్టార్ చిరంజీవి మనశంకరవర ప్రసాద్, నవీన్ పోలిశెట్టి అనగనగ ఒక రాజు, రవిజేత భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి పోటీ ఇవ్వనున్నాయి. ఈ చిత్రాలకు 'రాజా సాబ్' ఎలాంటి సమాధానం ఇస్తాడో చూడాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.

Updated Date - Dec 21 , 2025 | 05:46 PM