The Rajasaab: రాజాసాబ్ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
ABN , Publish Date - Nov 04 , 2025 | 01:47 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న తాజా చిత్రాల్లో ది రాజాసాబ్ (The Rajasaab) ఒకటి. మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు.
The Rajasaab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న తాజా చిత్రాల్లో ది రాజాసాబ్ (The Rajasaab) ఒకటి. మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
ఇక ప్రభాస్ సినిమా అంటే వాయిదా లేకుండా రిలీజ్ ఉండదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ది రాజాసాబ్ కూడా అదే తరహాలో వరుస వాయిదాలు పడుతూ వస్తుంది. డిసెంబర్ 5 న అనుకున్న సినిమా మరోసారి వాయిదా పడి సంక్రాంతి బరిలో దిగింది. జనవరి 9 న ది రాజాసాబ్ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక గతకొన్నిరోజులుగా సంక్రాంతి నుంచి కూడా రాజాసాబ్ తప్పుకుందని వార్తలు వస్తున్నాయి
తాజాగా రాజాసాబ్ వాయిదా రూమర్స్ ను నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఖండించాడు. కచ్చితంగా రాజుగారు సంక్రాంతికి వస్తున్నారని తెలిపారు. ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టనున్నట్లు.. డిసెంబర్ లో అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయనున్నట్లు చెప్పుకొచ్చారు. ఇలాంటి పుకార్లను నమ్మకుండా ఉండాలని అభిమానులను కోరాడు. ప్రసుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Phoenix: విజయ్ సేతుపతి కొడుకు కోసం మెగాఫోన్ పట్టిన అనల్ అరసు
Peddi Song: ‘చికిరి’ పాట కోసం రెహమాన్ ఎవర్ని దింపారంటే..