Mutton soup: ఫలితాన్ని ఊహించాం.. కష్టాన్ని మరిచిపోయాం 

ABN , Publish Date - Oct 13 , 2025 | 01:10 PM

'సినిమాలంటే  ఇష్టంతో  రైటింగ్ మీద దృష్టి పెట్టాను. అన్ని క్రాఫ్ట్‌ల మీద అవగాహన పెంచుకున్నాను. ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ తీశాను. నా పేరుని స్క్రీన్ మీద చూడాలని, నేను సినిమాలు చేయాలని మా అమ్మ కలలు కనేవారు. 

'సినిమాలంటే  ఇష్టంతో  రైటింగ్ మీద దృష్టి పెట్టాను. అన్ని క్రాఫ్ట్‌ల మీద అవగాహన పెంచుకున్నాను. ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ తీశాను. నా పేరుని స్క్రీన్ మీద చూడాలని, నేను సినిమాలు చేయాలని మా అమ్మ కలలు కనేవారు.  ఆ కలం ఇప్పటికి నెరవేరింది' అని నిర్మాత  మల్లిఖార్జున ఎలికా (Mallikharjuna Elika) అన్నారు. రామచంద్ర వట్టికూటి దర్శకత్వంలో మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల నిర్మించిన చిత్రం ‘మటన్ సూప్’ (Mutton Soup). రమణ్, వర్ష విశ్వనాథ్, జెమినీ సురేష్ (Gemini Suresh) ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ఈ మూవీ అక్టోబర్ 10న విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా  నిర్మాత మల్లిఖార్జున ఎలికా విలేకర్లతో ముచ్చటించారు.       

'నేను  పుట్టి పెరిగింది తిరుపతిలో. సినిమా రంగంతో అనుబంధాన్ని ఏర్పడింది హైదరాబాద్లోనే. ఈ ప్రాంత‌మంటే నాకెంతో ప్ర‌త్యేకం. సినిమాలంటే  ఇష్టంతో  రైటింగ్ మీద దృష్టి పెట్టాను. అన్ని క్రాఫ్ట్‌ల మీద అవగాహన పెంచుకున్నాను. ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ తీశాను. ‘బడి పంతులు’ షార్ట్ ఫిల్మ్‌కి రాష్ట్ర స్థాయిలో అవార్డు వచ్చింది. నా పేరుని స్క్రీన్ మీద చూడాలని, నేను సినిమా చేయాలని మా అమ్మ కలలు కనేవారు. ఆ కల ఇప్పుడు నిజమైంది. కానీ అది చూడటానికి మా అమ్మ గారు లేరు. ఆ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్ లో పని చేశాను. నా దర్శకత్వంలో ఓ హారర్ మూవీని నేను ప్రారంభించాను. ఆ ప్రాజెక్ట్ చిత్రీకరణ సమయంలో నాకు రామచంద్ర పరిచయం అయ్యారు. ఆయ‌న కష్టపడే తత్వం నాకు నచ్చింది. అలా ఈ సినిమా జర్నీ మొదలైంది. యదార్థంగా జరిగిన సంఘటన ఆధారంగా తీసిన సినిమా ఇది.  తెలిసిన కథను మేం కొత్తగా చెప్పాం. స్క్రీన్ ప్లే తో అందరినీ మ్యాజిక్ చేశాం. కథగా ఒకలా ఉంటే.. షూటింగ్ చేసిన తర్వాత సినిమా మొత్తాన్ని ఎడిటింగ్ టేబుల్ వద్ద మార్చేశాం. మా చిత్రం పేపర్ మీద కాకుండా ఎడిటింగ్ టేబుల్ వద్ద రెడీ అయిందని నేను గర్వంగా చెప్పుకోగలను. అర్ధిస్ట్స్ సహాయ మరిచిపోలేనిది. టెక్నికల్ టీం స్ట్రాంగ్ పిల్లర్‌లా నిలబడింది. వెంకీ వీణ పాటలు, ఆర్ఆర్ సినిమాకు ప్రధాన బలమైంది. భరద్వాజ్, ఫణింద్ర విజువల్స్‌కు మంచి పేరు వచ్చింది. మా చిత్ర బృందం పడిన కష్టానికి సక్సెస్ రూపంలో చక్కని ఫలితం వచ్చినందుకు ఆనందంగా ఉంది.  ఊహించినట్టుగానే మా చిత్రంలోని స్క్రీన్ ప్లే చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. క్రైమ్ కథను అద్భుతంగా ఎడిట్ చేసి చూపించారని ప్రశంసిస్తున్నారు. ఆడియన్స్ రియాక్షన్ చూస్తుంటే మేం ఇన్నేళ్లు పడ్డ కష్టాన్ని ఇట్టే మర్చిపోయాం. మా ఉత్సాహం రెట్టింపు అయింది. నేను దర్శకుడిగా  ఓ హారర్ మూవీ ని స్టార్ట్ చేశాను. అంతే కాకుండా నిర్మాతగానూ కొత్త వారితో మరిన్ని చిత్రాలు నిర్మిస్తాను.  రామచంద్ర తో మరో ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను. త్వరలోనే వాటికి సంబంధించిన వివరాలు ప్రకటిస్తాం' అని అన్నారు, 

Updated Date - Oct 13 , 2025 | 01:10 PM