C. Kalyan: ఐ బొమ్మ రవిని ఎన్ కౌంటర్ చేయాలి.. అప్పుడే భయపడతారు

ABN , Publish Date - Nov 18 , 2025 | 08:04 PM

ఐ బొమ్మ (I Bomma) నిర్వాహకుడు ఇమ్మడి రవి (Immadi Ravi)ని పోలీసులు అరెస్ట్ చేయడంతో సినిమా ఇండస్ట్రీ మొత్తం సంబరాలు చేసుకుంటుంది.

C. Kalyan

C. Kalyan: ఐ బొమ్మ (I Bomma) నిర్వాహకుడు ఇమ్మడి రవి (Immadi Ravi)ని పోలీసులు అరెస్ట్ చేయడంతో సినిమా ఇండస్ట్రీ మొత్తం సంబరాలు చేసుకుంటుంది.ఫైరసీ అనే భూతం ఇండస్ట్రీని ఎంతలా భయపెట్టిందో అందరికీ తెలుసు. ఎన్నో ఏళ్లుగా ఈ ఫైరసీని అరికట్టడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. ఇక ఎట్టకేలకు సీపీ సజ్జనార్ నేతృత్వంలో పోలీసులు.. ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. దీంతో సినిమా ఇండస్ట్రీ మొత్తం పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇప్పటికే సినీ సెలబ్రిటీలతో సజ్జనార్ ప్రెస్ మీట్ నిర్వహించిన విషయం తెల్సిందే.

ఇక తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఇమ్మడి రవి అరెస్ట్ పై ప్రెస్ మీట్ నిర్వహించింది. పోలీసులు చేసిన ఈ పనిని ప్రశంసించింది. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ.. ఎంతో శ్రమించి ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన పోలీసులకు దన్యవాదాలు తెలుపుతున్నాము. త్వరలోనే పోలీసులకు సన్మానం చేయనున్నాం. అసలు రవిని ఎన్ కౌంటర్ చేయాలి. అలా చేస్తేనే ఇంకోసారి ఇలా చేసేవాళ్లు భయపడతారు. ఇది నేను ఎంతో బాధతో, కడుపుమంటతో చెప్తున్నాను.

నేను సెక్రటరీగా ఉన్నప్పుడు యాంటీ వీడియో ఫైరసీ సెల్ ను మొదలుపెట్టారు. అప్పుడు అందరూ ఇది అస్సలు అవుతుందా అని అన్నారు. కానీ, మేము ధైర్యంగా మన సినిమాలను మనమే కాపాడుకోవాలి అనుకుని ఆ సెల్ ను ప్రారంభించాం. ఈ సెల్ లో కొందరు రిటైర్డ్ ఆఫీసర్లు పనిచేశారు. అప్పట్లో హాలీవుడ్ సినిమాలను ఫైరసీ చేసేవారిని పట్టుకున్నాం. ఇక్కడే కాదు విదేశీ సినిమాల విషయంలో కూడా పైరసీని అరికట్టేందుకు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నో చేసింది అస్ట్రేలియా, ఫ్రెంచ్ వాళ్ళు కూడా అభినందించారు. ఐ బొమ్మ వాళ్ళను పట్టుకోవడం లో రేవంత్ ప్రభుత్వం ఎంతో శ్రద్ధ పెట్టింది. పోలీస్ డిపార్ట్మెంట్ కు ధన్యవాదములు. ఫైరసీని అరికట్టేందుకు ప్రభుత్వంతో పాటు మేము ముందుకు సాగుతాం' అంటూ తెలిపారు.

Updated Date - Nov 18 , 2025 | 08:04 PM