Bunny Vas: సినిమా ఇండస్ట్రీ, ఆగ్ర హీరోల‌పై.. బ‌న్నీ వాస్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Jun 06 , 2025 | 12:09 PM

గ‌డిచిన నెల రోజులుగా ప‌ర్సంటేజీలు, ఎగ్జి బ్యూట‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్లు, థియేట‌ర్ల బంద్ అంటూ టాలీవుడ్‌లో తెగ హాడావుడి జ‌రిగిన విష‌యం తెలిసిందే.

bunny

గ‌డిచిన నెల రోజులుగా ప‌ర్సంటేజీలు, ఎగ్జి బ్యూట‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్లు, థియేట‌ర్ల బంద్ అంటూ టాలీవుడ్‌లో తెగ హాడా వుడి జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఆపై ఏపీ మంత్రి దుర్గేశ్‌, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌లుగ‌జేసుకోండం ఆ వివాదం కాస్త స‌ద్దుమ‌ణ‌గ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. గ‌త నాలుగు రోజులుగా అంతా స‌వ్యంగానే ఉంది అన్ని గొడ‌వ‌లు ముగిసిన‌ట్లే ఇక ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు త్వ‌ర‌లో వీట‌న్నింటికి ప‌రిష్కారం ల‌భిస్తుందని అంతా భావించారు. తీరా ఇప్పుడు ఈ అంశం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది.

తాజాగా.. ప్ర‌ముఖ నిర్మాత బన్నీ వాస్ (Bunny Vas) సినిమా ఇండస్ట్రీ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టం కాదు.. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని..! ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావుల.. నాది పావలా అని కొట్టుకోవడం కాదు.. మునపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి అనేది ఆలోచించాలి తప్ప.. ఇలాగ సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటిటికి ఇవ్వాలి అనే ట్రెండ్ కొనసాగితే .. రాబోయే నాలుగైదు ఏళ్లలో 90 శాతం సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయి అన్నారు.

bunny.PNG

ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి. మీరు రెండు సంవత్సరాలకు ఒక సినిమా మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరమైపోతారు. ఈ రెండు మూడేళ్లలో చాలా మంది థియేటర్ ఓనర్స్ వాటిని మెయింటైన్ చేయలేక మూసేస్తారు. సింగిల్ స్క్రీన్స్ మూత పడినట్టైతే ఓన్లీ మల్టీప్లెక్స్ థియేటర్స్ అయితే పెద్ద హీరోలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ సినిమా థియేటర్స్ ద్వారా వచ్చే ఆదాయం కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళుతుంద‌ని చెప్పారు. ఇప్పుడీ ఈ పోస్టు నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది.

అయితే.. ఇప్పుడు బ‌న్నీ వాస్ పోస్టులో మ‌రోసారి ఈ ఇష్యూ తెర‌పైకి వ‌చ్చింది. ఇది చూసిన వారంతా ఈ స‌మ‌స్య‌కు అంతం లేదా, ప‌రిష్కారం ఎప్పుడు వ‌చ్చేనో, ఎలా ల‌భించేనో అంటూ త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. అంతేగాక ఇప్పుడు మ‌రెంత మంది ఇలాంటి పోస్టులు మొద‌లెడ‌తారో అని కూడా అనుకుంటున్నారు.

ఇదిలాఉంటే.. వాసు గారు మీరు బాగానే చెప్పారు గానీ.. అదేదో ముందు ఎప్పుడూ మీ ప‌క్క‌నే ఉండే బ‌డా హీరో అల్లు అర్జున్‌కు ఈ విష‌యాలు చెప్పి ఒప్పించి అప్పుడు బ‌య‌టి వారికి స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వండి అంటూ ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్లు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Updated Date - Jun 06 , 2025 | 12:50 PM