Bunny Vas: సొంత బ్యానర్ పెట్టిన బన్నీ వాస్.. కొత్త సినిమా షురూ
ABN , Publish Date - Jun 04 , 2025 | 02:01 PM
అల్లు అర్జున్ స్నేహితుడిగా, గీతా ఆర్ట్స్2 వ్యవహారాలు చూసుకుంటున్న బన్నీ వాస్ సడన్‌గా సర్‌ఫ్రైజ్ ఇచ్చాడు.
అల్లు అర్జున్ స్నేహితుడిగా, గీతా ఆర్ట్స్2 వ్యవహారాలు చూసుకుంటున్న బన్నీ వాస్ (Bunnyvas) సడన్‌గా సర్‌ఫ్రైజ్ ఇచ్చాడు. కొత్తగా బీవీ వర్క్స్ పేరిట కొత్త బ్యానర్ స్థాపించి సప్త అశ్వ క్రియేటివ్స్ (SaptaAswaCreatives) , వైరా ఎంటర్టైన్మెంట్స్ (Vyra Entertainments) సంస్థలతో కలిసి సినిమాలు నిర్మించే నడుం బిగించారు. ఆక్రమంలో తాజాగా వీరు సంయిక్తగా నిర్మిస్తున్న సినిమాకు సంబంధించిన ప్రీ-లుక్ పోస్టర్ విడుదల చేసి క్యురియాసిటీ పెంచారు. ఈ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి అందెలోని నటులు ఎవరై ఉంటారా అని మాట్లాడుకుంటున్నారు.
బన్నీ వాస్ తొలిసారిగా.. గీతా ఆర్ట్స్ కు సంబంధం లేకుండా బయటకు వచ్చి బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్ పై సినిమాను సమర్పిస్తుండటం, నిర్మించడం పై సర్వత్రా చర్చ ప్రారంభమైంది.ఇక ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన భాను ప్రతాప్ గతంలో బన్నీ వాస్ తో కలిసి తండేల్ అంతకుముందు 'ఆయ్', 'సింగిల్' వంటి సినిమాలతో విజయాలు అందుకున్నారు. ఇప్పుడు వీరికి తోడుగా నానితో 'హాయ్ నాన్న' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ చేతులు కలపడం ఈ ప్రాజెక్ట్ కి అదనపు బలాన్ని చేకూరుస్తుంది.
తాజాగా ఆవిష్కరించబడిన ఆసక్తికరమైన ప్రీ-లుక్ పోస్టర్.. ఉత్సుకతను రేకెత్తించడంతో పాటు, నవ్వులను చిందించేలా ఉండగా ప్రియదర్శి హీరో అని తెలుస్తోంది. ఎరుపు రంగు టోపీలు, నీలిరంగు ముసుగులు ధరించి వరుసగా నిల్చొని ఉన్న కొందరు వ్యక్తులతో కూడిన ఈ పోస్టర్.. ఫన్, మిస్టరీ, జానర్ సినిమా అని తెలుస్తోంది. జూన్ 6న ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నట్లు ప్రకటించి.. సరికొత్త వినోదాత్మక చిత్రాన్ని అందించనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ చిత్రంతో విజయేంద్ర ఎస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ సినిమాకి సోమరాజు పెన్మెత్స సహ నిర్మాత. ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందిస్తున్నాడు.