Allu Aravind: ఆ నలుగురిలో నేను లేను.. న‌న్ను ఇన్వాల్ చేయ‌కండి

ABN , Publish Date - May 25 , 2025 | 05:50 PM

టాలీవుడ్‌లో సంచ‌ల‌నంగా మారిన థియేట‌ర్ల బంద్ చిలికి చిలికి గాలి వానగా మారి ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసే వ‌ర‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

allu

గ‌డిచిన వారం రోజులుగా టాలీవుడ్‌లో సంచ‌ల‌నంగా మారిన థియేట‌ర్ల బంద్ చిలికి చిలికి గాలి వానగా మారి ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan)సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసే వ‌ర‌కు వ‌చ్చింది. దీంతో ఏపీ మంత్రి నుంచి సినీ ఇండ‌ప్ట్రీపై రిట‌ర్న్ గిఫ్ట్ అంటూ కంప్లైంట్ లెట‌ర్ మీడియాకు విడుద‌ల చేశారు. ఈక్ర‌మంలో ప్ర‌ఖ్యాత నిర్మాత అల్లు అర‌వింద్ (Allu Aravind) ఆదివారం సాయంత్రం మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈయ‌న‌కు సంబంధించి ఏ సినిమా లేకున్నా.. ఇయ‌న ఇప్పుడెందుక‌య్యా ప్రెస్మీట్ పెట్టాడంటూ త‌న‌పై తానే సెటైర్లు వేసుకుని ఆక్క‌డి వారిలో న‌వ్వులు పూయించారు.

ఈ సంద‌ర్భంగా ఆయల్లు అర‌వింద్‌ మాట్లాడుతూ.. మీడియా మిత్రుల‌కు న‌మ‌స్కారం రెండు రోజులుగా ఇండస్ట్రీలో జ‌రుగుతున్న స‌మ‌స్య‌ల నేప‌థ్యంలో ఈ మీటింగ్ పెట్ట‌డం జ‌రిగింది. అయితే ఇటీవ‌ల త‌రుచూ వినిపిస్తోన్న ఆ న‌లుగురు అనే దాంట్లో నేను లేన‌ని న‌న్ను అందులో క‌ల‌పొద్ద‌ని తెలిపారు. 15 సంవ‌త్స‌రాలుగా ఆ న‌లుగురు అనే ప‌దం స్టార్ట్ అయింద‌ని ఆ త‌ర్వాత అది 10 మంది అయింద‌ని ఇప్పుడు ఆ న‌లుగురు అంటూ మ‌ళ్లీ రావ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. కోవిడ్ త‌ర్వాత నేను అందులోంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశాన‌ని. న‌న్ను అందులో క‌ల‌పొద్ద‌ని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల‌లో 1500 థియేట‌ర్లు ఉండ‌గా అందులో నాకు 15 థియేట‌ర్ల లీజులు మాత్ర‌మే ఉన్నాయని. అవి కూడా లీజ్ అయ్యాక క్లోజ్ చేసుకుంటాన‌ని, ప్ర‌స్తుతం అవి నా వ‌ద్ద పని చేసే వారి చేతుల్లోనే ఉన్నాయ‌న్నారు. తెలంగాణ‌లో నాకు ఒక్క థియేట‌ర్ లీజు కూడా లేద‌ని AAA నా సొంత థియేట‌ర్ అని అన్నారు. ఇక‌పై ఆ న‌లుగురిలో న‌న్ను ఇన్వాల్ చేయ‌వ‌ద్దని, నా పేరు తేవ‌ద్దని తెలిపారు.

ఇక ఇటీవ‌ల సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ చేసిన వ్యాఖ్య‌లు 100 శాతం స‌మంజ‌సం అని ఆయ‌న మాట‌ల‌తో నేను ఏకీభ‌విస్తున్నా అని అన్నారు. ఇటీవ‌ల 3 ప‌ర్యాయాలు జ‌రిగిన థియేట‌ర్ల మీటింగ్‌కు నేను కావాల‌నే వెళ్లలేద‌ని, మా గీతా డిస్ట్రీబ్యూట‌ర్స్‌ను సైతం వెళ్ల నీయ‌లేద‌ని అన్నారు. ఏదైనా స‌మ‌స్య వ‌స్తే ముందు మాట్లాడుకోవాలి, ఛాంబ‌ర్‌కు వెళ్లాలి అంతేగానీ ఎవ‌రికి వాళ్లు ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యం తీసుకోవ‌డం న‌చ్చ‌లేద‌న్నారు. అదీ కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా విడుద‌ల స‌మ‌యంలో బంద్ అనేది దుస్సాహాసం ఆయ‌న‌నేమైనా బెదిరిస్తున్నారా అని అన్నారు. సినిమా అనేది ప్రైవేటు వ్యాపారం.. ప్రభుత్వానికి సంబంధం లేదని కొందరు మాట్లాడారు. మరి గత ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ ను కొందరు సినీ పెద్దలు ఎందుకు కలిశారు?. ప్రభుత్వ సహకారం లేకపోతే ఏ వ్యాపారం కూడా సవ్యంగా సాగదు. కష్టం వస్తే కానీ సీఎంను కలవమా..? ఒక ఫార్మాలిటీ లేదా..?

ఇక్క‌డి నుంచి వెళ్లిన సినిమా వ్య‌క్తి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండి మ‌న సినిమా వాళ్ల‌కు అనేక ర‌కాల స‌హాయ సాకారాలు అందిస్తున్నార‌న్నారు. అశ్వినీ ద‌త్ సినిమా విష‌యంలో రేట్లు అడిగే స‌మ‌యం లోనే ఛాంబర్ తరపున సీఎం చంద్రబాబును కలవాలని పవన్ హింట్ ఇచ్చారు ఆ త‌ర్వాత అంతా మ‌రిచిపోయార‌ని, ప‌వ‌న్ స్వ‌యంగా చెప్పినా ఇప్ప‌టి వ‌ర‌కు ఎవరూ ముఖ్యమంత్రి చంద్ర‌బాబును క‌ల‌వక‌పోవ‌డం త‌ప్పిద‌మే అన్నారు. థియేట‌ర్లకు స‌మ‌స్య‌లు ఉన్నాయ‌నేది వాస్త‌వం కానీ కూర్చోని మాట్లాడుకోవాలని, పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్లాల‌ని అన్నారు.

Updated Date - May 25 , 2025 | 07:45 PM