Priyanka Chopra: వారణాసి బడ్జెట్ రూ. 1300 కోట్లు.. అందులో సగం ప్రియాంకకే
ABN , Publish Date - Dec 21 , 2025 | 03:38 PM
స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే.. ఆ సినిమాల బడ్జెట్ గురించి ఎప్పుడు ఏదొక వార్త వినిపిస్తూనే ఉంటుంది. ఇక దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పుకార్లపైనే సినిమా నడుస్తూ ఉంటుంది.
Priyanka Chopra: స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే.. ఆ సినిమాల బడ్జెట్ గురించి ఎప్పుడు ఏదొక వార్త వినిపిస్తూనే ఉంటుంది. ఇక దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పుకార్లపైనే సినిమా నడుస్తూ ఉంటుంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ కి అలానే జరిగింది. ఇప్పుడు వారణాసి(Vaaranaasi) కి కూడా ఇదే జరుగుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి సినిమాలో ప్రియాంక చోప్రా (Priyanaka Chopra) హీరోయిన్ గా నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక ప్రస్తుతం వారణాసి సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి దీని బడ్జెట్ దాదాపు వెయ్యి కోట్లు అని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా దీని బడ్జెట్ రూ. 1300 కోట్లు అని తెలుస్తోంది. తాజాగా కపిల్ శర్మ షోకి ప్రియాంక శర్మ హాజరయ్యింది. అందులో కపిల్.. డైరెక్ట్ గా ప్రియాంకను వారణాసి బడ్జెట్ గురించి అడగడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
వారణాసి బడ్జెట్ రూ. 1300 కోట్లు అని వినిపిస్తుంది. ఇలా బడ్జెట్ పెరగడానికి కారణం మీరే అని అంటున్నారు అని అడిగాడు. దానికి ప్రియాంక అంటే ఏంటి.. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ లోని సగభాగం నా బ్యాంక్ లోకి వచ్చింది అని అంటున్నారా అని నవ్వుతూ ప్రశ్నించింది. దానికి కపిల్.. ఏమో మాకేం తెలుసు అని చెప్పుకొచ్చాడు. ఇక నిజం చెప్పాలంటే.. వారణాసి బడ్జెట్ పెరగడానికి ప్రియాంక కారణం అనే మాట ఎప్పటి నుంచో వినిపిస్తుంది. ఆమె ఉండేది అమెరికాలో.. షెడ్యూల్ ఉన్నప్పుడల్లా అక్కడ నుంచి ఇండియాకి రావాలి. ఆమెతో పాటు వారి అసిస్టెంట్స్ కి, వారి స్టే అంతా మేకర్స్ భరించాల్సిందే. ప్రమోషన్స్ అయితే దానికి ఎక్స్ట్రా.. ఇలా బడ్జెట్ పెరగడానికి ఒకరకంగా ప్రియాంక కారణమే. అయినా కూడా ఆమెనే ఏరికోరి జక్కన్న ఎంచుకున్నాడు కాబట్టి మేకర్స్ కూడా తప్పదన్నట్లున్నారు. మరి ఈ సినిమాతో ప్రియాంక ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.