SSMB29: గ్లోబ్ ట్రాటర్.. మందాకినీ వచ్చేసింది
ABN , Publish Date - Nov 12 , 2025 | 08:00 PM
స్టార్ హీరో సినిమా వస్తుంది అంటే మేకర్స్ ఏం చేస్తారు.. ఒక్క చిన్న అప్డేట్ ఇవ్వడానికి అయినా వారం రోజుల ముందే ఆ అప్డేట్ ఇస్తున్నామని చెప్పి హైప్ పెంచుతూ ఉంటారు.
SSMB29: స్టార్ హీరో సినిమా వస్తుంది అంటే మేకర్స్ ఏం చేస్తారు.. ఒక్క చిన్న అప్డేట్ ఇవ్వడానికి అయినా వారం రోజుల ముందే ఆ అప్డేట్ ఇస్తున్నామని చెప్పి హైప్ పెంచుతూ ఉంటారు. కానీ, దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) మాత్రం SSMB 29 నుంచి అప్డేట్ ను ఎలాంటి చడీచప్పుడు లేకుండా ఇస్తున్నాడు. మొన్నటికి మొన్న సంచారి సాంగ్ అలాగే చేశాడు. ఇక ఇప్పుడు ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఫస్ట్ లుక్ ను కూడా ఎలాంటి హడావిడి లేకుండా రిలీజ్ చేసి షాక్ ఇచ్చాడు.
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం SSMB29. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే పృథ్వీరాజ్ లుక్ ను జక్కన్న రిలీజ్ చేశాడు. కుంభా అనే పాత్రలో ఆయన నటిస్తున్నట్లు తెలిపారు. ఇక ఇప్పుడు ప్రియాంక చోప్రా.. మందాకినీ అనే పాత్రలో నటిస్తుందని తెలుపుతూ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా.. పేరుకు తగ్గట్లే దేశీ గర్ల్ గా దర్శనమిచ్చింది. ఎల్లో కలర్ చీర కట్టుకొని.. చేతిలో గన్ పట్టుకొని.. సీరియస్ గా ఫైర్ చేస్తూ శివంగిలా కనిపించింది. ఇక ఆ నడుము కనిపించడం అయితే హైలెట్ అని చెప్పాలి. ఈ ఫోటోను జక్కన్న షేర్ చేస్తూ.. ప్రపంచ వేదికపై భారతీయ సినిమాను పునర్నిర్వచించిన మహిళ.. దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా.. నీకు తిరిగి స్వాగతం. మందాకినీ లోని లెక్కలేనన్ని షేడ్స్ ను చూడడానికి వేచి ఉండలేకపోతున్నాం' అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక చివరగా హీరో మహేష్ బాబు లుక్.. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ ఈవెంట్ నవంబర్ 15 న రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా జరగనుంది.