Priyamani: బన్నీ సినిమాలో ప్రియమణి.. 

ABN , Publish Date - Jun 06 , 2025 | 02:15 PM

పుష్ప 2(Pushpa 2) తరువాత అల్లు అర్జున్ (Allu Arjun).. అట్లీ(Atlee) సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Priyamani

Priyamani: పుష్ప 2(Pushpa 2) తరువాత అల్లు అర్జున్ (Allu Arjun).. అట్లీ(Atlee) సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. పుష్ప 2 సమయంలోనే బన్నీ, త్రివిక్రమ్(Trivikram) తో ఒక సినిమాను అధికారికంగా ప్రకటించాడు.  ఈ సినిమా పట్టాలెక్కుతుంది అనుకుంటే.. బన్నీ, అట్లీ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు.  ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పటికే బన్నీ పుష్ప 2 సినిమాతో గ్లోబల్  గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

 

 

జవాన్(Jawan) తరువాత అట్లీకి కూడా అంతే గుర్తింపు దక్కింది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తున్నారు అనేసరికి అన్ని ఇండస్ట్రీలు ఈ సినిమా వైపే చూస్తున్నాయి. అంతేకాకుండా ఇద్దరూ.. 1000 కోట్ల క్ల‌బ్ లో చేరిపోయారు. మార్కెట్ ప‌రంగా బ‌న్నీ ఒక అడుగు ముందే ఉన్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ ఇద్దరి టార్గెట్ రూ. 2500 కోట్లు. అందుకు తగ్గట్టుగానే అట్లీ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర వేగంగా జ‌రుగుతున్నాయి.

 

 

ఇక గత కొన్నిరోజులుగా ఈ చిత్రంలో బన్నీ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరోయిన్లు కూడా గ్లోబల్ లెవెల్ లో పేరు తెచ్చుకున్నవారినే తీసుకోవాలని చూస్తున్నారట. ఇదంతా పక్కన పెడితే..  బన్నీ - అట్లీ చిత్రంలో సీనియర్ హీరోయిన్ ప్రియమణి(Priyamani) కీలక పాత్రలో నటిస్తుదని టాక్ నడుస్తోంది. హీరోయిన్ గా మంచి సినిమాల్లో నటించిన ప్రియమణి.. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ బిజీగా మారింది. ఇక బన్నీ - అట్లీ చిత్రంలో  ప్రియమణి నటించడానికి కారణం అల్లు అర్జున్ అని తెలుస్తోంది.

 

 

గతంలో ప్రియమణి ఒక డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న సమయంలో బన్నీ  గెస్ట్ గా వెళ్ళాడు. ఆ షోలో ప్రియమణి.. బన్నీతో కలిసి నటించే అవకాశం తనకు రాలేదని, అది ఎప్పుడు వస్తుందా.. ? అని ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. దానికి బన్నీ కచ్చితంగా మనం కలిసి పనిచేద్దాం అని చెప్పుకొచ్చాడు.  ఇప్పుడు ఆ మాటనే గుర్తుపెట్టుకొని ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడని, ఆ లెక్కన చూస్తే అల్లు అర్జున్ మాట నిలబెట్టుకున్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది కాకపోయినా.. అట్లీ  డైరెక్షన్ లో వచ్చిన జవాన్ సినిమాలో  ప్రియమణి నటించింది. ఆ స్నేహబంధం వలన కూడా ఆమెను తీసుకొని ఉండొచ్చు. మరి ఈ సినిమాలో ప్రియమణి ఎలాంటి పాత్రలో కనిపించబోతుందో చూడాలి.  

Updated Date - Jun 06 , 2025 | 02:15 PM