Premante Teaser: మరో కొత్త కాన్సెప్ట్ తో వచ్చేసిన ప్రియదర్శి.. అదిరిపోయిన టీజర్
ABN , Publish Date - Nov 02 , 2025 | 05:21 PM
కమెడియన్ గా కెరీర్ ను మొదలుపెట్టి హీరోగా మారాడు ప్రియదర్శి (Priyadarshi). కొత్త కొత్త కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతున్నాడు.
Premante Teaser: కమెడియన్ గా కెరీర్ ను మొదలుపెట్టి హీరోగా మారాడు ప్రియదర్శి (Priyadarshi). కొత్త కొత్త కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతున్నాడు. కోర్ట్ లాంటి హిట్ సినిమా తరువాత ప్రియదర్శి నుంచి రెండు సినిమాలు వచ్చాయి. అవేమి ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయాయి. అయినా మంచి కథలతో ప్రేక్షకులను అలరించడానికి తానెప్పుడూ సిద్దమే అంటూ ఈసారి ప్రేమంటే (Premante) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ప్రియదర్శి, ఆనంది జంటగా నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ప్రేమంటే. జాన్వీ నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. పెళ్లి తరువాత భార్యాభర్తలు ఎలా ఉండాలి అని అనుకుంటారు.. ఎలా ఉంటారు అనేది వినోదాత్మకంగా చూపించబోతున్నట్లు టీజర్ ను బట్టి తెలుస్తోంది.
ప్రియదర్శి, ఆనంది పెళ్లికి ముందు ప్రతిదీ మాట్లాడి సాల్వ్ చేసుకోవాలని అనుకుంటారు. కానీ, పెళ్లి తరువాత గొడవలతో కాపురం సాగిస్తున్నట్లు చూపించారు. ప్రస్తుతం ప్రతి ఇంట్లో భార్యాభర్తలు మధ్య జరిగే చిన్న చిన్న గొడవలే విడాకులకు దారితీస్తున్నాయి. ఈ సినిమా కూడా అదే నేపథ్యంలో సాగుతున్నట్లు కనిపిస్తుంది. పెళ్లి చేసుకుంటే థ్రిల్ ఉండాలనుకునే అమ్మాయి.. తన వల్ల అమ్మాయికి ఎలాంటి సమస్య రాకూడదు అనుకొనే అబ్బాయికి మధ్య జరిగే యుద్ధమే ప్రేమంటే. ఇక సుమ కనకాల ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తుంది. నవంబర్ 21 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ప్రియదర్శి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.