Priyadarshi: గడ్డి పీకమంటావా.. నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ప్రియదర్శి
ABN , Publish Date - Nov 21 , 2025 | 08:54 AM
పెళ్లి చూపులు సినిమాలో నా చావు నేను చస్తా.. నీకెందుకు అనే డైలాగ్ తో ప్రియదర్శి (Priyadarshi) ఓవర్ నైట్ స్టార్ కమెడియన్ గా మారాడు.
Priyadarshi: పెళ్లి చూపులు సినిమాలో నా చావు నేను చస్తా.. నీకెందుకు అనే డైలాగ్ తో ప్రియదర్శి (Priyadarshi) ఓవర్ నైట్ స్టార్ కమెడియన్ గా మారాడు. ఇక ఈ సినిమా తరువాత కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి .. మల్లేశం ,బలగం (Balagam) సినిమాలతో హీరోగా మారాడు.బలగం సినిమా భారీ విజయాన్ని అందించడంతో కమెడియన్ కాస్తా హీరోగా సెటిల్ అయ్యాడు. విజయాపజయాలను పట్టించుకోకుండా హీరోగానే వరుస సినిమాలను చేస్తూ వస్తున్నాడు. ఇక ఈ ఏడాదిలో రిలీజ్ అయిన కోర్ట్ (Court) సినిమా ప్రియదర్శికి మరింత పెద్ద హిట్ ను ఇచ్చింది.
ప్రస్తుతం ప్రియదర్శి హీరోగా నటిస్తున్న చిత్రం ప్రేమంటే. నవనీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆనంది హీరోయిన్ గా నటిస్తుండగా సుమ కనకాల ఒక కీలక పాత్రలో నటించింది. ఇక ఈ సినిమా నవంబర్ 21 అంటే.. ఈరోజే రిలీజ్ అవుతుంది. ఇక దీంతో ప్రియదర్శి సోషల్ మీడియాలో అభిమానులతో మాట్లాడాడు. వారు అడిగిన ప్రతి ప్రశ్నకు ఓపిగ్గా సమాధానము ఇచ్చాడు. మంచి ప్రశ్నలు వేసేవారితో పాటు తిక్కగా ప్రశ్నలు వేసినవారికి కూడా ప్రియదర్శి ఓ రేంజ్ లో కౌంటర్లు ఇచ్చాడు.
ఒక నెటిజన్.. నువ్వు మూవీ తీయడం ఆపు అన్నా.. ప్లీజ్ అన్నా అంటూ అడగ్గా.. దాని ప్రియదర్శి.. 'మరి ఏం చేయమంటావ్.. గడ్డి పీకాలనా' అంటూ సమాధానం ఇచ్చాడు. సదరు నెటిజన్ దానికి.. **లు పిసుక్కో అన్నా.. న్యూ ట్రెండ్ అని అంటే.. నువ్వు రేపు థియేటర్ కు రా తమ్మి.. నీ గుండెలు పిండి పంపిస్తా' అంటూ పోస్ట్ చేశాడు. దీంతో నెటిజన్స్ .. గట్టిగా ఇచ్చావ్ అలానే ఉండు ప్రియదర్శి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.