Vaibhavam: తల్లే అతిథిగా ప్రీ రిలీజ్ ఫంక్షన్

ABN , Publish Date - May 22 , 2025 | 04:53 PM

సాత్విక్ హీరోగా రుత్విక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'వైభవం'. ఈ సినిమా శుక్రవారం విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.

తమకు జన్మనిచ్చి, పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేయడమే కాకుండా... కార్పొరేట్ ఉద్యోగాలను వదిలిపెట్టి, సినిమా రంగంలో తమ ఉనికిని చాటుకోవాలన్న తమ తపనను కూడా ప్రోత్సహించిన తమ మాతృమూర్తిని సాదరంగా సత్కరించుకున్నారు దర్శకహీరో ద్వయం సాత్విక్ - రుత్విక్ (Satvik and Ruthvik)! విద్యాధికులైన ఈ సోదరుల్లో.. తమ్ముడు సాత్విక్ దర్శకుడిగా, అన్నయ్య రుత్విక్ హీరోగా పరిచయమవుతూ... తల్లి రమాదేవి నిర్మాతగా తెరకెక్కిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'వైభవం' (Vaibhavam). ఈ సినిమా శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లోని ప్రివ్యూ థియేటర్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఏర్పాటు చేశారు. ఆ వేదికపై తమ మాతృమూర్తి రమాదేవిని ఈ అన్నదమ్ములిద్దరూ సాదరంగా సత్కరించుకున్నారు.


'చిన్నప్పటి నుంచి చదువులో, ఆటపాటల్లో అన్నిటా ముందుండి, మంచి ఉద్యోగాలు సంపాదించుకుని, తనకు ఎనలేని పుత్రోత్సాహాన్ని సాత్విక్, రుత్విక్ పంచార'ని లాయర్ అయిన రమాదేవి తెలిపారు. సినిమా మీద ఉన్న ప్యాషన్ తో వారు ఉద్యోగాలను వదిలిపెట్టి 'వైభవం' చిత్రాన్ని రూపొందించారని చెప్పారు. ఈ సినిమాతో వారు చిత్రసీమలో విజయబావుటా ఎగరేస్తారనే నమ్మకం ఉందని ఆమె విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తమపై తల్లి పెట్టుకున్న నమ్మకం వమ్ము కాదని రుత్విక్, సాత్తిక్ తెలిపారు. ఇంటిల్లిపాదీ కలిసి చూసి ఆస్వాదించతగ్గ చిత్రంగా దీనిని మలిచామని, సెన్సార్ నుండి క్లీన్ యు సర్టిఫికెట్ వచ్చిందని అన్నారు. ఈ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టడం గర్వంగా ఉందని హీరోయిన్ ఇక్రా ఇద్రసి (Iqra Idreesi) తెలిపింది. ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రధారులు పోషించిన కె.ఎల్.ఎన్, అనంత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Also Read: Raja Shivaji: జెనీలియా నిర్మాత‌గా రాజా శివాజీ... హీరో కమ్ డైరెక్టర్ గా రితేశ్

Also Read: Peddi: పెద్ది మ‌రో అప్టేట్‌.. భారీ యాక్ష‌న్ సీన్ల చిత్రీక‌ర‌ణ‌

Also Read: Theatre Bandh: మూడు సెక్టార్స్ తో మీటింగ్

Also Read: Spirit: ప్రభాస్ మూవీ నుండి తప్పుకున్న దీపిక...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 22 , 2025 | 04:59 PM