First Look: ప్రేమలో రెండోసారి
ABN , Publish Date - Jul 16 , 2025 | 02:43 AM
రమణ సాకే, వనిత గౌడ జంటగా నటించిన ‘ప్రేమలో రెండోసారి’ చిత్రం ఫస్ట్ లుక్‌ను సీనియర్ నిర్మాత సి.కల్యాణ్ విడుదల చేశారు. సత్య మార్క దర్శకత్వంలో...
రమణ సాకే, వనిత గౌడ జంటగా నటించిన ‘ప్రేమలో రెండోసారి’ చిత్రం ఫస్ట్ లుక్‌ను సీనియర్ నిర్మాత సి.కల్యాణ్ విడుదల చేశారు. సత్య మార్క దర్శకత్వంలో సాకే నీరజ లక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రం గురించి హీరో రమణ సాకే మాట్లాడుతూ ‘నేటి యువతకు బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఇందులో నా పాత్ర కొత్తగా ఉంటుంది. సినిమా బాగా వచ్చింది. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్లుగా దర్శకుడు రూపొందించారు’ అని చెప్పారు. ఈ సినిమాను ఆదరించాలని నిర్మాత నీరజ లక్ష్మి ప్రేక్షకులను కోరారు.