Prasanth Varma: ఈ అవార్డుల వెనుక ఎంతో కష్టం ఉంది
ABN , Publish Date - Aug 01 , 2025 | 09:38 PM
సినిమాల్లో అత్యుత్తమ సేవలు అందించిన టెక్నీషియన్స్ ను గుర్తించి వారి సేవలకు కేంద్ర ప్రభుత్వం జాతీయ పురస్కారాలతో సత్కరిస్తూ ఉంటుంది.
Prasanth Varma: సినిమాల్లో అత్యుత్తమ సేవలు అందించిన టెక్నీషియన్స్ ను గుర్తించి వారి సేవలకు కేంద్ర ప్రభుత్వం జాతీయ పురస్కారాలతో సత్కరిస్తూ ఉంటుంది. కొద్దీసేపటి క్రితమే ప్రభుత్వం 71 వ జాతీయ పురస్కారాలకు అర్హులైనవారి పేర్లను ప్రకటించింది. అందులో టాలీవుడ్ 7 అవార్డులను కైవసం చేసుకుంది. ఈ 7 అవార్డుల్లో రెండు అవార్డులను సొంతం చేసుకుంది హనుమాన్( Hanuman). బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ గా నందు, పృథ్వీ ఈ అవార్డును అందుకోనుండగా.. బెస్ట్ ఫిల్మ్ (యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ కామిక్) విభాగంలో వెంకట్ కుమార్ చిట్టి మరో అవార్డును అందుకోనున్నారు.
ఇక తమ టీమ్ ఈ అవార్డులను అందుకోవడంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ.. జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపాడు. ' మా సినిమాకు రెండు అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉంది. వీరికి ఈ అవార్డులు వచ్చాయి అంటే కనుక వారి వెనుక ఎంతోమంది కృషి ఉంది. మా నిర్మాతలు, నటులు, టెక్నీషియన్స్ కు నా తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జ్యూరీ సభ్యులకు మాకు ఈ అవార్డులు ఇచ్చినందుకు మా యూనిట్ తరువాత థాంక్స్' అంటూ చెప్పుకొచ్చాడు.