OG Mania: థియేట‌ర్ల‌కు.. లైన్ క‌ట్టిన సెల‌బ్రిటీలు! వీడియోలు వైర‌ల్

ABN , Publish Date - Sep 25 , 2025 | 07:12 AM

ఓజీ (OG) సినిమా మొత్తానికి ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌కు వ‌చ్చి హంగామా సృష్టిస్తోంది.

OG

ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) ఓజీ (OG) సినిమా మొత్తానికి ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌కు వ‌చ్చి హంగామా సృష్టిస్తోంది. ఎక్క‌డ చూసినా ఓజీ మేనియానే న‌డుస్తూ ఓ వారం ముందుగానే ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు అస‌లు పండుగ‌ను తీసుకు వ‌చ్చింది. ప్రీమియ‌ర్స్ నుంచే అభిమానులు ఎగ‌బ‌డ‌డంతో ముందే అన్ని ప్రాంతాల‌లో హౌజ్‌ఫుల్స్ అయ్యాయి. ఇక సినిమా చూడ‌డానికి అభిమానుల‌ను మించి సెల‌బ్రిటీలు సైతం లైన్లు క‌ట్ట‌డంతో అస‌లు ఏం జ‌రుగుతుందిరా అంటూ అభిమానులు షాక్‌తో కూడిన సంబ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురౌతున్నారు.

ముఖ్యంగా స‌లార్‌, కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్‌, వ‌రుణ్ తేజ్‌, విష్ణు తేజ్‌, కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ర‌వితేజ వార‌సులు నిర్మాత ఎస్కేఎన్‌, మాస్ మ‌హారాజ్ ర‌వితేజ వార‌సులు, డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్‌ ఇంకా చాల‌మంది వ‌ర్ధ‌మాన హీరో హీరోయిన్లు అంతా ఓజీ ప్ర‌ద‌ర్శిత‌మ‌వ‌తున్న థియేట‌ర్ల‌లోనే సంద‌డి చేశారు. ఇంకా స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా అఖిరా నంద‌న్‌, ఆద్యలు సైతం బుధ‌వారం రాత్రి బాలాన‌గ‌ర్ విమ‌ల్ థియేట‌ర్‌. మూసాపేట్ శ్రీరాములు థియేట‌ర్ల‌లో సినిమాను తిల‌కించారు.

సెల‌బ్రిటీలు ఒక‌రి త‌ర్వాత ఒక‌రు సినిమా చూడ‌డానికి రావ‌డంతో ఫ్యాన్స్ లో ఊత్సాహం మ‌రింత రెట్టింపు అయింది. వారితో ఫొటోలు దిగ‌డానికి, చూడ‌డానికి ఎగ‌బ‌డ్డారు. ఆపై అభిమానుల‌తో క‌లిసి సెల‌బ్రిటీలు సైతం డ్యాన్సులు వేస్తూ.. పేప‌ర్లు ఎగ‌రేస్తూ, విజిల్స్ వేస్తూ స‌రికొత్త‌ జోష్ తీసుకు వ‌చ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాను ఆల్లాడిస్తున్నాయి.

Updated Date - Sep 25 , 2025 | 07:32 AM