Prabhas: సినిమాను.. పండుగలా మార్చే వ్యక్తి

ABN , Publish Date - Oct 24 , 2025 | 11:29 AM

ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు డబుల్‌ ట్రీట్‌. హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రానికి ‘ఫౌజీ’ టైటిల్‌ ప్రకటించగా, ‘రాజాసాబ్‌’ మూవీ టీమ్‌ కొత్త లుక్‌ను రిలీజ్‌ చేసింది.

prabhas

'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ చేస్తున్న ప్రతీ చిత్రంపైన అంచనాలు భారీస్థాయిలో ఉంటున్నాయి. ఆయన కథానాయకుడిగా మారుతి తెరకెక్కిస్తున్న హారర్ కామెడీ థ్రిల్లర్ 'రాజాసాబ్' ట్రైలర్ ఇటీవలే విడుదలై అందరినీ అలరించింది. ఇందులో వింటేజ్ లుక్‌లో ప్రభాస్ కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా గురువారం ‘సినిమాను పండుగలా మార్చే వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని ‘రాజాసాబ్‌’ (Raja Saab) చిత్రబృందం ప్రభాస్‌కు విషెస్ తెలుపుతూ ఓ స్టైలిష్‌ పిక్‌ను విడుదల చేసింది. ఇందులో చుట్టూ జన సమూహం మధ్యలో ఓపెన్‌ టాప్‌ కారులో ప్రభాస్‌ ఇస్తున్న పోజు ప్రస్తుతం అందర్నీ ఆకట్టుకుంటోంది.

prabhas.jfif

మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి. సందర్భంగా జనవరి 9న చిత్రం విడుదలవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో మాళవికా మోహన్, నిధి అగర్వాల్, రిద్దికుమార్ కథానాయికలు. మరోవైపు, 'బాహుబలి' సిరీస్‌లోని రెండు భాగాలను కలిపి చేస్తున్న 'బాహుబలి: ద ఎపిక్' ఈ నెల 31న విడుదలవుతోంది.

spirit

మరోవైపు, ప్రభాస్‌ కథానాయకుడిగా సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెరకెక్కించనున్న‘స్పిరిట్‌’ (Spirit) చిత్రం షూటింగ్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ సినిమా నుంచి కూడా గురువారం రాత్రి ఓ సౌండ్ స్టోరీ అంటూ కేవ‌లం క్యారెక్ట‌ర్ల డైలాగ్స్‌తో కూడిన‌ అడియో గ్లిమ్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ తీసుకు వ‌చ్చారు.

పాండవుల పక్షాన నిలిచిన కర్ణుడు

ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రంపై అంచనాలు ఏస్థాయిలో ఉన్నాయో తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి కీలక అప్డేట్ను పంచుకున్నారు మేకర్స్. గురువారం ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ను ప్రకటిస్తామని ప్రకటించి, ప్రీ లుక్ ను విడుదల చేశారు. 'పద్మవ్యూహాన్ని చేధించిన అర్జునుడు.. పాండవుల పక్షాన నిలిచిన కర్ణుడు.. ఒక్కడిగానే పోరాడే బెటాలియన్.. 1932 నుంచి మోస్ట్ వాంటెడ్' అని విడుదల చేసిన పలు ప్రచార చిత్రాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.

fauzi

ప్రభాస్ (Prabhas) పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు తీపి కబురు అందింది. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రభాస్‌, హను రాఘవపూడి (Hanu Raghavapudi) తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామాచిత్రం టైటిల్‌ను ‘ఫౌజీ’ (Fauji)గా మేకర్స్‌ అనౌన్స్ మెంట్ చేశారు. ఈ టైటిల్‌ చిత్రం ప్రారంభమైన నాటి నుంచి ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మేకర్స్ ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేసి ప్రబాస్‌కు బర్త్‌డే విషెస్‌ తెలిపారు.

‘పద్మవ్యూహాన్ని ఛేదించిన అర్జునుడు.. పాండవుల పక్షాల నిలిచిన కర్ణుడు.. గురువులేని ఏకలవ్యుడు.. పుట్టుకతోనే అతను ఓ యోధుడు.. మన చరిత్రలో దాగిన అత్యంత ధైర్యవంతుడైన సైనికుడి కథ ఇది’ అని పేర్కొన్నారు. 1930 దశకంలో సాగే ఈ కథలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారు. ఇమాన్వీ కథానాయిక కాగా అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భానుచందర్, క‌న్న‌డ బ్యూటీ చైత్ర జే అచార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. టీ సిరీస్ గుల్షన్కుమార్, భూషణ్ కుమార్ సమర్పిస్తున్నారు

Updated Date - Oct 24 , 2025 | 11:37 AM