Amitabh Bachchan: బిగ్‌బీకు శుభాకాంక్షల వెల్లువ..

ABN , Publish Date - Oct 11 , 2025 | 04:44 PM

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌(Amitabh Bachchan) 83వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌(Amitabh Bachchan)
83వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. టాలీవుడ్‌ స్టార్‌ హీరో ప్రభాస్‌ (Prabhas)ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా బచ్చన్‌కు విషెస్‌ చెప్పారు. ‘మీ వర్క్‌ను దగ్గర నుంచి చూడడం, మీతో కలిసి స్క్రీన్  పంచుకోవడం నాకు దక్కిన గౌరవం. మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో చేసుకోవాలి’ అని పోస్ట్‌లు పేర్కొన్నారు. అలాగే నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ కూడా బిగ్‌బీకు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్‌ పెట్టారు. (Bday wishes TO BigB)

వీరిద్దరూ కలిసి ‘కల్కి 2898 ఏడీ’ నటించిన సంగతి తెలిసిందే! ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచి రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సైన్స్‌ ఫిక్షన్‌ మూవీలో అమితాబ్‌ బచ్చన్‌.. అశ్వత్థామగా, ప్రభాస్‌ భైరవగా నటించి అలరించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ‘కల్కి2’కు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఈ చిత్రం నుంచి కథానాయిక దీపిక పదుకొణెను తొలగించిన సంగతి తెలిసిందే! దీంతో సీక్వెల్‌లో ఆ పాత్రను ఎవరు పోషిస్తారా అనే చర్చ మొదలైంది. ఆ పాత్రను అలియాభట్‌కు దక్కినట్లు వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

Updated Date - Oct 11 , 2025 | 04:53 PM