Prabhas: క్లైమాక్స్ పెన్నుతో రాశారా.. గన్నుతో రాశారా అనేలా ఉంటుంది
ABN , Publish Date - Dec 28 , 2025 | 07:31 AM
ప్రభాస్ నటించిన రాజాసాబ్ ప్రీ రిలీజ్ వేడుకలో మారుతి రైటింగ్, క్లైమాక్స్, జరీనా వాహబ్ నటనపై ప్రశంసలు.
‘నా అభిమానులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలని ‘రాజాసాబ్’ (Rajasaab) చిత్రం చేశాం. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు చూసి మారుతి (Maruthi) రైటింగ్‌కు అభిమానిగా మారాను. పతాక సన్నివేశాలను ఆయన పెన్నుతో రాశారా, మెషీన్ గన్నుతో రాశారా అనే స్థాయిలో ఉంటాయి’ అని ప్రభాస్ (Prabhas) ప్రశంసించారు. ఆయన కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 9న విడుదలవుతోంది.
శనివారం హైదరాబాద్‌లో చిత్రబృందం ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో సీనియర్ నటి జరీనా వాహబ్ నాకు నాయనమ్మ పాత్రలో నటించారు. డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆమె నటనను అలా చూస్తుండిపోయాను. ఈ సినిమాకు ఆమె కూడా ఓ హీరోనే.
బడ్జెట్ పెరిగినా విశ్వప్రసాద్ గారు ఎంతో ధైర్యంగా ఈ సినిమాను నిర్మించారు. రిద్ది (Riddhi Kumar), మాళవిక (Malavika Mohanan), నిధి (Nidhhi Agerwal) ముగ్గురూ తమ నటనతో ఆకట్టుకుంటారు. ఇలాంటి క్లైమాక్స్‌తో ఇప్పటివరకూ ఏ చిత్రం రాలేదు. రేపు ట్రైలర్ వస్తుంది. చూడండి. అదిరిపోతుంది. మా ‘రాజాసాబ్’తో పాటు సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వాలి’ అని ఆకాంక్షించారు.