Raja Saab: ప్రభాస్ రాజా సాబ్ అప్డేట్ వచ్చేసింది.. ఇక ఫ్యాన్స్ ను ఆపడం కష్టమే!
ABN , Publish Date - Jun 03 , 2025 | 11:04 AM
‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాల సక్సెస్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ చిత్రం నుంచి ఎట్టకేలకు అప్డేట్ వచ్చేసింది.
‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాల సక్సెస్ తర్వాత ప్రభాస్ (Prabhas) నుంచి నటిస్తున్న చిత్రం ‘రాజా సాబ్’ (Raja Saab). మారుతి (maruthi) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ నాయికలు. ఈ పాటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం అనివార్య కారణాల వళ్ల షూటింగ్ ఆలస్యం అవుతూ ఇంకా చివరి దశ షూటింగ్‌లోనే ఉండి పోయింది.
అయితే అభిమానులు, సినీ లవర్స్ సినియమాకు సంబంధించి అప్‌డేట్ అంటూ పదే పదే ఒత్తిడి తేవడంతో మేకర్స్ ఎట్టకేలకు ఈ మూవీ నుంచి అప్డేట్ ఇచ్చారు. సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రభాస్ లుక్‌తో ఓ పోస్టర్ విడుదల చేసి డిసెంబర్5న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా థియేటరల్లోకి తీసుకు వస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా జూన్ 16న మూవీ టీజర్ సైతం రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
చఇక చాలా రోజుల తర్వాత ప్రభాస్ ‘రాజా సాబ్’ (Raja Saab) సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తాజాగా రిలీజ్ చేసిన అప్డేట్ న్యూస్‌ను సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి తీసుకు వచ్చి హంగామా సృష్టిస్తున్నారు. అంతా సిద్ధంగా ఉండండి డిసెంబర్‌లో.. బాక్సులు, కలెక్షన్లు, రికార్డులు బద్దలు కావాల్సిందే అంటూ ట్వాట్లు, కామెంట్లు, మీమ్స్ తో చెలరేగి పోతున్నారు.