Prabhas: యూరప్‌కి ‘రాజాసాబ్’.. ఏం చేయబోతున్నారంటే..
ABN , Publish Date - Oct 06 , 2025 | 04:47 PM
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది రాజాసాబ్’ సంక్రాంతి బరిలో సందడి చేయనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పాన్ ఇండియాగా నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రభాస్ (Prabhas) హీరోగా మారుతి (maruthi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది రాజాసాబ్’ (the Rajasaab) సంక్రాంతి బరిలో సందడి చేయనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పాన్ ఇండియాగా నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ కథానాయికలు. సంజయ్ దత్ ముఖ్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ చివర దశలో ఉంది. ఈ వారం నుంచి యూరప్‌లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించనున్నారు. దీనికోసం చిత్ర బృందం ఇప్పటికే అక్కడికి చేరుకుంది. ఈ షెడ్యూల్‌లో నాయకానాయికలపై రెండు పాటలు చిత్రీకరించనున్నారు.
మరోవైపు నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో ప్రభాస్ రెండు భిన్నమైన కోణాల్లో కనిపిస్తారు. మూడు నెలల ముందే ఈ సినిమా ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. విజువల్‌గా ఈ ట్రైలర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. వింటేజ్ లుక్ లో ప్రభాస్ వెర్సటైల్‌గా కనిపించి ఆకట్టుకున్నారు. తమన్ బీజీఎంలోని వేరియేషన్స్ రాజా సాబ్ ట్రైలర్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. మొత్తం మీదగా ఈ ట్రైలర్ 40 మిలియన్ల డిజిటల్ వ్యూస్ సాధించి ట్రెండింగ్‌లో ఉంది.