Prabhas: కల్కి సీక్వెల్.. ప్రభాస్ డేట్స్ ఇచ్చేది ఎప్పుడు.. ?
ABN , Publish Date - Jun 05 , 2025 | 07:30 PM
గతేడాది రిలీజైన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన కల్కి 2898AD(Kalki 2898AD) ఒకటి.
గతేడాది రిలీజైన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన కల్కి 2898AD(Kalki 2898AD) ఒకటి. మొదటి పార్ట్ భారీ విజయం అందుకోవడంతో.. ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ మొత్తం కల్కి సీక్వెల్ కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తోంది. ఈ సినిమా సీక్వెల్ ఎంత వీలైతే అంత త్వరగా ఫినిష్ చేసి రిలీజ్ చేస్తామని నాగ్ అశ్విన్(Nag Ashwin) అప్పట్లో చెప్పుకొచ్చాడు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడప్పుడే ప్రభాస్ డేట్స్.. నాగీకి దొరికేలా లేవు.
కల్కికి ముందే రెండు సినిమాలు.. ఆ తరువాత మరో 3 సినిమాలను ప్రభాస్ ఓకే చేశాడు.ఇప్పటికే రాజాసాబ్(Rajasaab) షూటింగ్ ను ఫినిష్ చేసి రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. దీని తరువాత స్పిరిట్(Spirit) లైన్లో ఉంది. ఆగస్టులో ఈ సినిమా పట్టాలెక్కుతుంది. ఇది ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ఈ సినిమా మధ్యలోనే డార్లింగ్ ఫౌజీ(Fauji) షూటింగ్ మొదలుపెట్టనున్నాడు.
ఇప్పుడు కల్కి సీక్వెల్ కు డేట్స్ ఎప్పుడు ఇస్తాడు.. అనేది పెద్ద సమస్యగా మారింది. ఈ రెండు సినిమాలను పూర్తీ చేసిన తరువాత కల్కికి డేట్స్ ఇస్తాడా.. ? అప్పటివరకు నాగీ పరిస్థితి ఏంటి.. ? ఇదే అయోమయంలో డైరెక్టర్ కూడా ఉన్నాడట. ప్రస్తుతం నాగీ మరో రెండు కొత్త స్క్రిప్ట్స్ పై వర్క్ చేస్తున్నాడు. వాటిని ముందు ఫినిష్ చేయడానికి సిద్దమయ్యాడట.
కల్కి సీక్వెల్ కు ప్రభాస్ వి బల్క్ డేట్స్ కావాలి. అది డార్లింగ్ ఎప్పుడు ఇస్తాడో.. అప్పుడే కల్కి సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్లనుంది. మొదట ప్రభాస్ డేట్స్ ను లాక్ చేసి.. ఆ తరువాత అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్(Kamal Haasan), దీపికా పదుకొనే డేట్స్ ను లాక్ చేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే కల్కి సీక్వెల్ ముందుకు కదలాలి అంటే ప్రభాస్ డేట్స్ కావాలి. మరి డార్లింగ్ డేట్స్ ఇచ్చేది ఎప్పుడు.. ? కల్కి 2 సెట్స్ మీదకు వెళ్ళేది ఎప్పుడు.. ? అనేది తెలియాల్సి ఉంది.