Pawan Kalyan: మొన్న ప్రభాస్.. నేడు పవన్.. ఫ్యాన్స్ కోసం దేనికైనా రెడీ

ABN , Publish Date - Dec 14 , 2025 | 02:30 PM

సాధారణంగా అభిమానులు.. హీరోల కోసం ఏదైనా చేస్తారు. హీరోలకు తామెవ్వరమో తెలియకపోయినా వారి పుట్టినరోజులు అన్నదానం, రక్తదానం, పాలాభిషేకం, పూలాభిషేకం చేస్తూ ఉంటారు.

Pawan Kalyan

Pawan Kalyan: సాధారణంగా అభిమానులు.. హీరోల కోసం ఏదైనా చేస్తారు. హీరోలకు తామెవ్వరమో తెలియకపోయినా వారి పుట్టినరోజులు అన్నదానం, రక్తదానం, పాలాభిషేకం, పూలాభిషేకం చేస్తూ ఉంటారు. కానీ, అభిమానుల కోసం హీరోలు ఏం చేశారు.. ? ఎప్పటి నుంచో అందరిని తొలుస్తున్న ప్రశ్న. అభిమానుల వద్దకు వెళ్లి మాట్లాడడం, ఫోటోలు ఇవ్వడం ఇలాంటి చేస్తారు. వారిని ఆనందపర్చడానికి ఇంతకు మించి ఏం చేస్తారు అంటే.. ఒకప్పుడు అభిమానులు తమలో చూసింది.. తిరిగి ఇస్తున్నారు.

అదెలా సాధ్యం అంటే.. ఒకప్పుడు తమ అభిమాన హీరో డ్యాన్స్ వేస్తే థియేటర్ లో రచ్చ చేసే అభిమానులు.. ఇప్పుడు తమ హీరో డ్యాన్స్ వేయడం మానేశాడు అని తెలిస్తే వారిలో నిరాశ కచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఆ నిరాశతోనే ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మిగతా హీరోల ఫ్యాన్స్.. మీ హీరోకు డ్యాన్స్ వేసే సత్తా లేదు అని గేలిచేస్తున్నా ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటున్నారు. ఆ ఇద్దరు హీరోలు ఎవరో కాదు పవన్ కళ్యాణ్, ప్రభాస్. కొన్నేళ్లుగా వీరిద్దరూ డ్యాన్స్ కి దూరంగా ఉన్నారు.

ప్రభాస్ యాక్షన్ సినిమాలతో వస్తున్నాడు. సాంగ్స్ ఉన్నా కూడా అందులో నడవడం తప్ప స్టెప్పేసింది లేదు. సేమ్ పవన్ కూడా ఏదో ఒక మెసేజ్ ఓరియెంటెడ్ కథతో వస్తున్నాడు. సాంగ్స్ లో కూడా పవన్ కనిపించడం తప్ప స్టెప్పులు వేసేది ఉండదు. దీంతో ఇతర హీరోల ఫ్యాన్స్ ముందు పవన్, ప్రభాస్ ఫ్యాన్స్ తల వంచుకోవాల్సి వస్తుంది. వీరిద్దరితో సినిమాలు తీసే డైరెక్టర్స్ ఎక్కడ కనిపించినా ఫ్యాన్స్ తమ హీరోలతో స్టెప్ వేయించాలని కోరుతున్నారు. ఇక ఫ్యాన్స్ కోసం దేనికైనా రెడీ అనే ఈ హీరోలు ఎట్టకేలకు వారి కోరికను నెరవేర్చారు. ప్రభాస్.. ది రాజాసాబ్ సినిమాలో రెబల్ సాబ్ కి కాలు కదిపి షేక్ చేశాడు. ఎప్పుడో ఈశ్వర్ లో డార్లింగ్ ఇలా మాస్ డ్యాన్స్ వేయడం చూసాం.. ఇప్పుడు మళ్లీ చూస్తున్నామని రెబల్ ఫ్యాన్స్ సంతోషంతో గంతులు వేశారు. ఇక దీనిని సాధ్యమయ్యేలా చేసిన మారుతీకి థాంక్స్ చెప్పుకొచ్చారు.

ఇప్పుడు పవన్ వంతు వచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ లో దేఖ్ లేంగే సాలా సాంగ్ కి పవన్ వేసిన స్టెప్స్ నెవ్వర్ బిఫోర్ అన్నట్లు ఉన్నాయి. పవన్ నిజంగా ఇంత డ్యాన్స్ వేశాడా అని అభిమానులే షాక్ అవుతున్నారు. వీరిద్దరూ తమ అభిమానుల కోసం ఎంతో రిస్క్ చేసి ఈ సాంగ్స్ చేశారు. నిజంగా వీరు స్టెప్పేస్తే భూకంపమే అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ లో ఉన్నారు.మరి ఈ రెండు సినిమాలతో ఈ ఇద్దరు హీరోలు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Updated Date - Dec 14 , 2025 | 02:44 PM