Hari Hara Veera Mallu: బుర్జ్ ఖలీఫా పై ట్రైలర్ ప్రదర్శన
ABN, Publish Date - May 17 , 2025 | 12:32 PM
'హరిహర వీరమల్లు' సినిమా ఏకంగా ఐదు భాషల్లో విడుదల కాబతోంది. పవన్ కళ్యాణ్ కు ఇది తొలి పాన్ ఇండియా మూవీ. జూన్ 12న విడుదల కానున్న ఈ సినిమా తొలి కాపీ కోసం మేకర్స్ రేయింబవళ్ళు కష్టపడుతున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) షూటింగ్ ఎప్పుడైతే పూర్తి అయ్యిందో అప్పటి నుండి 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) చిత్ర బృందం మొత్తం రేయింబవళ్ళు ఫస్ట్ కాపీని సిద్ధం చేయడానికి కృషి చేస్తోంది. తెలుగులోనే కాకుండా 'హరిహర వీరమల్లు' ప్రపంచవ్యాప్తంగా మరో నాలుగు భాషల్లోనూ వస్తోంది. దాంతో తొలి కాపీ మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన దర్శకుడు ఎ.ఎం. జ్యోతి కృష్ణ (A.M. Jyothi Krishna) తాజాగా దానికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సినిమాను ను చూసిన డబ్బింగ్ సిబ్బంది, సౌండ్ ఇంజనీర్ పప్పు, అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాస్, కో-డైరెక్టర్ రంగనాధ్ తదితరులంతా ఎగ్జయిట్ అయ్యారంటూ జ్యోతి కృష్ణ పేర్కొన్నారు. సి.జి. అండ్ డబ్బింగ్ వర్క్ ఫుల్ స్వింగ్ లో రాత్రింబవళ్ళు జరుగుతోందని అన్నారు. ఇక మీదట ప్రతి అప్ డేట్ ను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియచేస్తామని అన్నారు.
బుర్జ్ ఖలీఫా పై ట్రైలర్!
'హరిహర వీరమల్లు' మూవీ ట్రైలర్ ను వినూత్నంగా ఆవిష్కరించే ప్రయత్నం మేకర్స్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బుర్జ్ ఖలీఫా (Burj Khalifa) పై దీనిని ప్రదర్శించే ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఇంతవరకూ పలు తెలుగు సినిమాలకు సంబంధించిన టీజర్స్, పోస్టర్స్, అనౌన్స్ మెంట్స్ బుర్జ్ ఖలీఫా పై జరిగాయి. కానీ మొట్టమొదటిసారి ఓ తెలుగు సినిమా ట్రైలర్ ను అక్కడ ప్రదర్శించడం జరుగబోతోందని, ఆ ఖ్యాతి 'హరిహర వీరమల్లు'కే దక్కబోతోందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సైతం త్వరలోనే మేకర్స్ ప్రకటిస్తారట.
ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి (M.M. Keeravani) సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకి, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు. చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్న ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు భాగమయ్యారు. మొఘల్ చక్రవర్తిగా బాబీ డియోల్ (Bobby Deol) నటిస్తున్నారు. నిధి అగర్వాల్ (Nidhhi Agerwal), సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న 'హరి హర వీరమల్లు' చిత్రం, జూన్ 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
Also Read: Nayanthara: చిరు, అనిల్ సినిమాలో నయన్...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి