Police Vaari Hechcharika: సందేశాత్మక చిత్రం
ABN , Publish Date - Jul 15 , 2025 | 05:51 AM
సన్ని అఖిల్, అజయ్ ఘోష్, రవి కాలే, షాయాజీ షిండే తదితరులు నటించిన చిత్రం ‘పోలీస్ వారి హెచ్చరిక’. బాబ్జీ దర్శకత్వంలో తూలికా తనిష్క్ క్రియేషన్స్ బేనర్‌పై బెల్లి జనార్దన్...
సన్ని అఖిల్, అజయ్ ఘోష్, రవి కాలే, షాయాజీ షిండే తదితరులు నటించిన చిత్రం ‘పోలీస్ వారి హెచ్చరిక’. బాబ్జీ దర్శకత్వంలో తూలికా తనిష్క్ క్రియేషన్స్ బేనర్‌పై బెల్లి జనార్దన్ నిర్మించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చిత్రం తొలి టికెట్‌ని లాంచ్ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మట్టి కవి బెల్లి యాదయ్య మాట్లాడుతూ ‘సినిమాలోని సన్నివేశాలను రియల్ లొకేషన్స్‌లో చిత్రీకరించారు. ఈ చిత్రం సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తుంది’ అని అన్నారు. నిర్మాత బెల్లి జనార్దన్ మాట్లాడుతూ ‘మంచి కంటెంట్ ఉన్న ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’ అని కోరారు. చిత్ర దర్శకుడు బాబ్జి మాట్లాడుతూ ‘రొటీన్ చిత్రాలకు భిన్నంగా మా సినిమా ఉంటుంది. ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు మంచి సందేశాన్ని ఇవ్వబోతున్నాం’ అని అన్నారు.