Sundarakanda: ఫ్లీజ్ మేడమ్.. లిరికల్ సాంగ్ రిలీజ్
ABN , Publish Date - Jul 31 , 2025 | 07:30 PM
నారా రోహిత్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సుందరకాండ’ నుంచి ఫ్లీజ్ మేడమ్ లిరికల్ సాంగ్ రిలీజ్
నారా రోహిత్ ( Nara Rohith) కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సుందరకాండ’ (Sundarakanda). వృతి వాఘని ఈ చిత్రంలో కథానాయిక . శ్రీదేవి విజయ్‌కుమార్, నరేశ్ విజయ కృష్ణ కీలకపాత్రలు పోషిస్తున్నారు. వెంకటేశ్ నిమ్మలపూడి (Venkatesh Nimmalapudi)ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహంకాళి ఈ సినిమాను నిర్మించారు.
అన్ని కార్యక్రమిలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో థియేటర్లలోకి వస్తోంది. ఈ క్రమంలో మేకర్స్ తాజాగా ఫ్లీజ్ మేడమ్ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు శ్రీ హర్ష ఈమని (Sri Harsha Emani) సాహిత్యం అందించగా లియోన్ జేమ్స్ (Leon James) సంగీతంలో అర్జున్ చాంది, దీపక్ బ్లూ. అరవింద్ శ్రీనివాస్, సాయి శరణ్, రేష్మ శ్యాం, హరి ప్రియ, లవితా లోబో ఆలపించారు.