Kuberaa: కుబేర నుంచి.. పిపిపి డుండుండుం పాట వ‌చ్చేసింది

ABN , Publish Date - Jun 11 , 2025 | 11:27 AM

నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న కాంబినేష‌న్‌లో టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్ట‌ర్‌ శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కుబేర’ .

kubera

నాగార్జున (Nagarjuna), ధనుష్ (Dhanush), రష్మిక మందన్న (Rashmika) కాంబినేష‌న్‌లో టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్ట‌ర్‌ శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కుబేర’ (Kuberaa). సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మాతలు. జూన్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచిన మేక‌ర్స్ ఇప్ప‌టికే విడుద‌ల చేసిన పాట‌లు, గ్లిమ్స్ టీజ‌ర్ మూవీపై అంచ‌నాల‌ను రెట్టింపు చేశాయి.

ఈనేప‌థ్యంలో ఈ చిత్రం నుంచి పీపీ డుండుండుం(PippiPippi DumDumDum) అంటూ క‌థానాయిక ర‌ష్మిక‌పై చిత్రీక‌రించిన వీడియో సాంగ్‌ను మేక‌ర్స్ బుధ‌వారం ఉద‌యం విడుద‌ల చేశారు. చైత‌న్య పింగ‌ళి (Chaitanya Pingali) సాహిత్యం అందించిన ఈ పాట‌ను మంగ్లీ సోద‌రి ఇంద్రావ‌తి చౌహాన్ (Indravathi Chauhan) ఆల‌పించ‌గా రాక్‌స్టార్ దేవీశ్రీ ప్ర‌సాద్ (Devi Sri Prasad) సంగీతం స‌మ‌కూర్చాడు. ఈ పాట వింటుంటే మ‌రో హిట్ అవ‌డ‌మే గాక సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటుంద‌ని నెటిజ‌న్లు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

Updated Date - Jun 11 , 2025 | 11:28 AM