8 Vasanthalu: 8 వసంతాలు.. డైలాగ్స్ రిలీజ్
ABN , Publish Date - Jul 23 , 2025 | 05:07 PM
జూన్‌లో థియేటర్లలోకి వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకున్న చిత్రం 8 వసంతాలు.
జూన్‌లో థియేటర్లలోకి వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకున్న చిత్రం 8 వసంతాలు (8 Vasantalu). గతంలో 'మను', మధురం వంటి విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఫణీంద్ర నర్సెట్టి (Phanindra Narsetti) దర్శకత్వం వహించాడు. మ్యాడ్ మూవీ ఫేం అనంతిక సనీల్‌కుమార్ (Ananthika Sanil Kumar) లీడ్ రోల్‌లో నటించగా రవి దుగ్గిరాల, హనురెడ్డి, కన్నా పసునూరి కీలక పాత్రలు పోషించారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.
అయితే.. థియేటర్లలో ఫర్వాలేదనిపించుకున్న ఈ సినిమా ఇటీవలే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి రెట్టింపు ప్రజాధరణనను దక్కించుకుంటోంది. ముఖ్యంగా సినిమాలోని డైలాగ్స్ అందరినీ ఇట్టే ఇంప్రెస్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీలోని డైలాగ్స్‌ను (8 Vasantalu Dialogue Jukebox) ఆడియో రూపంలోనూ రిలీజ్ చేసి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు మేకర్స్. మొత్తంగా 27 నిమిషాల 3 సెకన్ల నిడివి ఉన్న ఈ ఆడియో జూక్ బాక్స్‌లో సినిమాలో మంచి ప్రాచూర్యం పొందిన 12 డైలాగులు ఉన్నాయి.