Peddi Team - Rahman concert:చైల్డ్ డ్రీమ్ అన్న రామ్ చరణ్.. తెలుగులో దంచిన జాన్వీ

ABN , Publish Date - Nov 09 , 2025 | 12:27 PM

ఆస్కార్ విజేత ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్ కాన్సర్ట్‌ (AR Rahman Concert) శనివారం రాత్రి రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా 'పెద్ది' సినిమా టీం రామ్‌చరణ్‌ (Ram Charan), జాన్వీ కపూర్‌(Janhvi Kapoor), బుచ్చిబాబు సాన హాజరై మరింత జోష్‌ పెంచారు.

సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత  ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్  కాన్సర్ట్‌ (AR Rahman Concert) శనివారం రాత్రి రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఘనంగా  జరిగింది. రెహమాన్‌ లైవ్‌ పెర్ఫామెన్స్‌తో మ్యూజిక్ లవర్స్ ని అలరించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా 'పెద్ది' సినిమా టీం రామ్‌చరణ్‌ (Ram Charan), జాన్వీ కపూర్‌(Janhvi Kapoor), బుచ్చిబాబు సాన హాజరై మరింత జోష్‌ పెంచారు. ఈ కాన్సర్ట్‌లో ‘పెద్ది’లోని తొలి పాట ‘చికిరి’ (Chikiri) లిరికల్‌ వీడియోను స్క్రీన్స్‌పై ప్రదర్శించడం విశేషం. 'రెహమాన్‌తో కలిసి వర్క్‌ చేయాలన్నది ఎన్నో ఏళ్ల కల. అది ‘పెద్ది’తో నెరవేరింది' అని  రామ్‌చరణ్‌ తెలిపారు. 

2.jpg

అయితే  ఈ వేదికపై ‘పెద్ది’ సినిమా గురించి తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు జాన్వీ కపూర్‌. ' ఈ సినిమాలో భాగమయ్యే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. నా ఫస్ట్ సింగల్ సాంగ్ అందరికి నచ్చింది అనుకుంటున్నా. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు డిఫరెంట్, యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అందరూ చాలా కష్టపడుతున్నాం' అన్నారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన పలు వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

1.jpg

రామ్‌ చరణ్‌, జాన్వీ కపూర్‌ జంటగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న చిత్రమే ‘పెద్ది’ (Peddi). ఈ చిత్రానికి రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. శుక్రవారం విడుదలైన ఈ పాట.. ఇప్పటికే రికార్డులు  సృష్టించింది. 13 గంటల్లో 32 మిలియన్లు, 24 గంటల్లో 46 మిలియన్ల వ్యూస్‌ సొంతం చేసుకుంది. భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్‌ పొందిన పాటగా నిలిచిందని  మేకర్స్ చెప్పారు. 

Updated Date - Nov 09 , 2025 | 12:37 PM