Peddi: పెద్ది అప్డేట్.. ఈ సీన్స్ సినిమాకు ఎంతో కీలకం
ABN , Publish Date - Dec 24 , 2025 | 10:53 AM
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పెద్ది. జాన్వీ కపూర్ కథ నాయిక. ఈ పాన్ ఇండియా చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు.
రామ్ చరణ్ (Ram charan) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'పెద్ది' (Peddi). జాన్వీ కపూర్ కథానాయిక. ఈ పాన్ ఇండియా చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా ఢిల్లీలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఉత్తరాంధ్రలో సాగే కథ ఇది. క్రీడా నేపథ్య అంశాలతో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చితం నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.

'చికిరి' సాంగ్ (Chikiri Song) మిలియన్ల వ్యూస్ సాధించి ట్రెండ్ సెట్ చేసింది. జాన్వీ లుక్ కూడా సూపర్ అనిపించుకుంది. వచ్చే ఏడాది మార్చి 27న రానుంది. శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. ఏ చిత్రానికి ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ' ఇదొక మట్టి సినిమా అని, తన కెరీర్లో బెస్ట్ సినిమా అవుతుందని' రామ్ చరణ్ ఎన్నో సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే!